ఇది నాకు అవసరం.. ఇంత ద్వేషం ఎందుకన్నా?.. కోపం మీ ఆరోగ్యానికి మంచిది కాదు..

నేటితో ‘బద్రి’ చిత్రం 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రేణు దేశాయ్ తన అనుభవాలను షేర్ చేశారు..

నేటితో ‘బద్రి’ చిత్రం 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రేణు దేశాయ్ తన అనుభవాలను షేర్ చేశారు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘బద్రి’ నేటితో విజయవంతంగా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు అభిమానులు, ప్రేక్షకులు ఆ సినిమా యూనిట్‌కి పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభినందనలు తెలియచేస్తున్నారు. దర్శకుడిగా పూరి జగన్నాథ్ డెబ్యూ మూవీ అయిన ‘బద్రి’ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఇకపోతే నేడు ఈ సినిమాలో ఒక కథానాయికగా నటించిన రేణు దేశాయ్, తనను ఈ సినిమాలో వెన్నెల క్యారెక్టర్‌కు సెలెక్ట్ చేసినందుకు దర్శకుడు పూరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలానే ఆ సినిమా షూటింగ్ సమయంలో హీరో పవన్ కళ్యాణ్‌తో కలిసి సరదాగా దిగిన రెండు ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘బద్రి’ సినిమా షూటింగ్ ఎంతో సరదాగా సాగిపోయింది, ఆ రోజు ప్యాకప్ అయిన తర్వాత కళ్యాణ్ గారితో కలిసి తీసుకున్న ఫోటో ఇది. కళ్యాణ్ గారితో ‘చికితా’ సాంగ్‌తో పాటు.. నాతో ‘వరమంటే’ అనే ఫీల్ సాంగ్ కొంత పార్ట్ ఇక్కడే షూట్ చేశారు. హీరో పవన్ గారు, నేను సినిమాని ఎంతో ఎంజాయ్ చేస్తూ నటించాం, నటిగా నాకు మంచి గుర్తింపునిచ్చిన ‘బద్రి’ సినిమా తాలూకు అనుభవాలు నేను ఎప్పటికీ మరువలేను’ అంటూ పోస్ట్ చేశారు.

అయితే ఒక వ్యక్తి ఇదంతా ఎందుకిప్పుడు అవసరమా అంటూ చేసిన పోస్ట్ ఆమె దృష్టికి రాగా స్పందించారు. ‘ఈ రేణు దేశాయ్ ఏంటో మళ్లీ కెలుకుతుంది. అవసరమా ఇప్పుడు.. ఆ మధ్య చాలా ఓవరాక్షన్ చేసింది మళ్లీ ఈ పోస్టులు ఎందుకు.. ఎంగేజ్‌మెంట్ అయింది కదా ఆ విషయం ఏమైంది మళ్లీ?’.. అంటూ చేసిన పోస్ట్ గురించి ‘మెసేజ్‌లో నాకిప్పుడే ఈ స్క్రీన్ షాట్ వచ్చింది. అవసరమా? అవును, అవసరం.. బద్రి చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. మీ Information కోసం. ఇది నా ఫస్ట్ మూవీ. నాకు చాలా స్పెషల్ మూవీ. ఇంత ద్వేషం ఎందుకన్నా.. మనం ఆల్ రెడీ ఒక వరల్డ్ క్రైసిస్‌లో ఉన్నాం.. ఒక వైరస్ వల్ల.. అందరి గురించి కొంచెం మంచి ఆలోచనలు పెట్టుకోండి. ఇంత కోపం మీ ఆరోగ్యానకి పనికి రాదు’.. అంటూ రేణు స్పందించారు.