Renu Desai : కంగ్రాట్స్ అన్నయ్య.. అంటూ ఆ ఎమ్మెల్యేపై రేణుదేశాయ్ పోస్ట్..

తాజాగా నేడు రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కంగ్రాట్స్ అన్నయ్య అంటూ ఓ ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపింది.

Renu Desai : ఏపీలో కూటమి భారీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఏపీలో గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సినీ ప్రముఖుల స్నేహితులు, బంధువులు కూడా పలువురు గెలవడంతో సినీ పరిశ్రమ నుంచి కూడా అభినందనలు వస్తున్నాయి. ఈ క్రమంలో రేణు దేశాయ్ ఆల్రెడీ నిన్నే మాజీ భర్త పవన్ గెలుపుపై సోషల్ మీడియాలో పోస్ట్ వేసింది.

Also Read : Varun Dhawan : తండ్రి అయిన బాలీవుడ్ స్టార్ హీరో.. పాప పుట్టిందంటూ..

తాజాగా నేడు రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కంగ్రాట్స్ అన్నయ్య అంటూ ఓ ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రేపల్లె నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన అనగాని సత్యప్రసాద్ దాదాపు 40 వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. ఈ క్రమంలో రేణు దేశాయ్ అనగాని సత్యప్రసాద్ కు కంగ్రాట్స్ అన్నయ్య.. అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఈయన గతంలో కూడా రెండు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచాడు.

అయితే రేణు దేశాయ్ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ను అన్నయ్య అని పిలుస్తూ పోస్ట్ పెట్టడంతో వీరి మధ్య ఏదైనా బంధుత్వం ఉందా లేక వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యంతో అలా పిలుస్తుందా అని చర్చించుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు