Varun Dhawan : తండ్రి అయిన బాలీవుడ్ స్టార్ హీరో.. పాప పుట్టిందంటూ..

తాజాగా ఈ బాలీవుడ్ జంట పండంటి పాపకు జన్మనిచ్చారు.

Varun Dhawan : తండ్రి అయిన బాలీవుడ్ స్టార్ హీరో.. పాప పుట్టిందంటూ..

Bollywood Couple Varun Dhawan Natasha Dalal Blessed with Baby Girl

Updated On : June 5, 2024 / 9:51 AM IST

Varun Dhawan : బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తండ్రి అయ్యాడు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, భేడియా, కళంక్, బేబీ జాన్, స్ట్రీట్ డ్యాన్సర్, స్త్రీ 2.. ఇలాంటి పలు సినిమాలతో బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు వరుణ్ ధావన్. వరుణ్ ధావన్ ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ ని ప్రేమించి 2021 లో పెళ్లి చేసుకున్నాడు.

Also Read : Venkatesh : బంధువుల్ని గెలిపించుకున్న వెంకటేష్.. ప్రచారం చేసిన రెండు చోట్ల భారీ గెలుపు..

తాజాగా ఈ బాలీవుడ్ జంట పండంటి పాపకు జన్మనిచ్చారు. వరుణ్ ధావన్ – నటాషా తల్లితండ్రులు అయ్యారు. వరుణ్ ధావన్ తన సోషల్ మీడియాలో.. మాకు బేబీ గర్ల్ పుట్టింది. మా ఫ్యామిలీలోకి బేబీ ధావన్ వచ్చింది. మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

View this post on Instagram

A post shared by VarunDhawan (@varundvn)

వరుణ్ ధావన్ – నటాషా తల్లితండ్రులు అవ్వడంతో అభిమానులు, పలువురు ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇటీవల తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ కూడా మూడో సారి తండ్రి అయిన సంగతి తెలిసిందే. ఆ జంట మూడో సారి పండంటి బాబుకి జన్మనిచ్చారు.