Venkatesh : బంధువుల్ని గెలిపించుకున్న వెంకటేష్.. ప్రచారం చేసిన రెండు చోట్ల భారీ గెలుపు..
హీరో విక్టరీ వెంకటేష్ స్వయంగా వచ్చి తన బంధువులు పోటీ చేసిన రెండు స్థానాల్లో ప్రచారం చేసారు.

Venkatesh Relatives Kamineni Srinivas and Ramasahayam Raghuram Reddy Winning with Huge Majority
Venkatesh : ఈ సారి జరిగిన ఎన్నికల్లో సినీ ప్రముఖులు కూడా చాలా మంది తమకు కావాల్సిన వారికి ప్రచారం చేసారు. అభ్యర్థులు కూడా పలువురు సినీ ప్రముఖులను తమ ప్రచారం కోసం తెచ్చుకున్నారు. సినీ పరిశ్రమల బంధువులు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయడంతో వాళ్లంతా వచ్చి ప్రచారం చేసారు. ఈ క్రమంలో హీరో విక్టరీ వెంకటేష్ స్వయంగా వచ్చి తన బంధువులు పోటీ చేసిన రెండు స్థానాల్లో ప్రచారం చేసారు.
తెలంగాణ ఖమ్మం లోక్ సభ ఎన్నికల్లో వెంకటేష్ వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసారు. రఘురాంరెడ్డి కోసం వెంకటేష్, ఆయన కూతురు ఆశ్రిత స్వయంగా వచ్చి ప్రచారంలో పాల్గొన్నారు, స్పీచ్ లు ఇచ్చారు. ఖమ్మంలో రఘురాంరెడ్డి ఏకంగా 4 లక్షలకు పైగా భారీ మెజార్టీతో గెలిచారు. వెంకటేష్ కుమార్తె ఆశ్రితను రామసహాయం రఘురాంరెడ్డి తనయుడికి ఇచ్చి వివాహం చేశారు. ఖమ్మంలో రఘురాంరెడ్డి భారీ విజయంతో వెంకటేష్ కుటుంబంలో సంతోషం నెలకొంది.
Also Read : Pawan kalyan – Vijay : పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపిన తమిళ్ స్టార్ హీరో విజయ్.. పవన్ లాగే విజయ్ కూడా..
అలాగే ఆంధ్రప్రదేశ్ లో కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నుంచి నుంచి పోటీ చేసిన కామినేని శ్రీనివాస్ కోసం కూడా వెంకటేష్ స్వయంగా వచ్చి కైకలూరులో ప్రచారం చేశారు. కామినేని శ్రీనివాస్ కూడా దాదాపు 45 వేల మెజారిటీతో గెలుపొందారు. గతంలో కామినేని కోసం వెంకటేష్ తండ్రి రామానాయుడు కూడా ప్రచారం చేశారు. కామినేని శ్రీనివాస్ కు వెంకటేష్ భార్యకు బంధుత్వం ఉంది. వెంకటేష్ కి పెళ్లి సంబంధం కుదిర్చింది కామినేని శ్రీనివాసే. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. వెంకటేష్ సపోర్ట్ చేసిన ఇద్దరు అభ్యర్థులు గెలవడంతో ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.