పవన్ కూడా అదే జిల్లాలో : రైతు సమస్యలపై కర్నూలుకు రేణూ దేశాయ్

  • Publish Date - February 25, 2019 / 05:10 AM IST

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన కథాంశంగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ఒకప్పటి హీరోయిన్ రేణూ దేశాయ్ సినిమా తీస్తున్నది. ఈ సినిమా కోసం కథను సిద్దం చేస్తున్న రేణూ దేశాయ్ ప్రస్తుతం కథకు సంబంధించి రీసెర్చ్ చేస్తుంది. ఇందులో భాగంగా రేణూ దేశాయ్.. ఫిబ్రవరి 25వ తేదీ (సోమవారం) కర్నూల్ జిల్లాలో పర్యటిస్తుంది. ఆదివారం రాత్రే మంత్రాలయం చేరుకున్న ఆమె స్థానిక ఎస్‌వీబీ అతిథిగృహంలో బస చేసింది. అనంతరం ఆలూరు మండలం తుంబళబీడు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరమర్శించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను తెలుసుకోనుంది. బాధిత కుటుంబాల పరిస్థితులను అధ్యయనం చేసి వాటిని పూర్తిగా రాసుకోనుంది.

ఆలూరు మండలం తుంబళబీడుకు చెందిన నెరణికి రామయ్య దంపతులు గతేడాది ఆగస్టులో ఆత్మహత్య చేసుకోగా.. అదే ఏడాది డిసెంబర్‌ 25న పెద్దకడబూరుకు చెందిన పెద్దరంగన్న ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు రేణూదేశాయ్.. వారి కుటుంబాలను పరామర్శించి వారి కథలను తన సినిమాతో ప్రపంచానికి తెలియజేయాలని భావిస్తున్నారు.
Read Also: చేతులారా చేసుకున్నాం : ధోనీ వల్లే మ్యాచ్ ఓడిపోయాం

ఆమె దర్శకురాలిగా రీ ఎంట్రీ ఇస్తూ రైతుల సమస్యలపై సినిమా తీస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అందుకోసం రేణు దేశాయ్‌ స్వయంగా రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించి స్క్రీన్‌ప్లే వర్క్‌ కూడా ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తుంది. ఆమె డైరెక్టర్ గా గతంలో ’ఇష్క్‌ వాలా లవ్‌’ అనే మరాఠీ చిత్రాన్ని తెరకెక్కించింది. ఇఫ్పుడు రైతులపై సినిమాను మాత్రం భారతీయ అన్నీ భాషలలో చిత్రీకరించనున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ కూడా కర్నూలు జిల్లాలోనే పర్యటిస్తున్నారు. మూడు రోజులు సీమ గడ్డపై తిరుగుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వెళుతున్నారు. ఓ వైపు పవన్ కల్యాణ్ – మరోవైపు రేణుదేశాయ్ ఇద్దరూ కూడా కర్నూలు జిల్లాలోనే ఉండటం ఆసక్తిగా మారింది. విషయం తెలిసిన అందరూ.. అన్నతోపాటు వదిన కూడా వచ్చిందోచ్చ్ అంటూ సెటైర్లు వేసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ ఫిబ్రవరి 25వ తేదీ సోమవారం కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోనీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
Read Also: కొత్త చట్టం ఎఫెక్ట్ : మళ్లీ నోట్ల కష్టాలు రాబోతున్నాయా.. ATMలు ఖాళీనా!