గోపిచంద్ 28 ఫస్ట్‌లుక్

మ్యాచో హీరో గోపీచంద్, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఫస్ట్‌లుక్ జనవరి అప్‌డేట్..

  • Published By: sekhar ,Published On : January 25, 2020 / 10:40 AM IST
గోపిచంద్ 28 ఫస్ట్‌లుక్

Updated On : January 25, 2020 / 10:40 AM IST

మ్యాచో హీరో గోపీచంద్, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఫస్ట్‌లుక్ జనవరి అప్‌డేట్..

మ్యాచో హీరో గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘గౌతమ్ నంద’ తర్వాత గోపిచంద్, సంపత్ నంది కలయికలో.. ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బ్యానర్‌పై ‘ప్రొడక్షన్ నెం.3’ గా శ్రీనివాసా చిట్టూరి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Image

హీరోగా గోపిచంద్ 28వ సినిమా ఇది. మ్యాచో హీరోతో మిల్కీబ్యూటీ తమన్నా జతకడుతుంది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో గోపిచంద్, తమన్నా వేర్వేరు రాష్ట్రాలకు చెందిన కబడ్డీ కోచ్‌లుగా కనిపించనున్నారు.

Read Also : మహేష్‌‌కి మోకాలి ఆపరేషన్ – రెండు నెలలు అమెరికాలో విశ్రాంతి?

ఈ సినిమా ఫస్ట్ లుక్ జనవరి 27 ఉదయం 8:47 నిమిషాలకి రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు. టైటిల్ కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. #Gopichand28FirstLook హ్యాష్ ట్యాగ్‌తో గోపిచంద్ 28 ఫస్ట్ లుక్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌‌లో ఉండడం విశేషం.