Jani Master Issue: జానీ మాస్టర్ వివాదానికి ఎండ్ కార్డ్.. ‘నాన్ కోఆపరేషన్’ ఎత్తివేసిన ఫెడరేషన్
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master Issue), తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, డాన్సర్స్ యూనియన్ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది.
- V Santhosh Kumar
- Published on- July 19, 2026 / 09:54 PM IST
Revocation of the non-cooperation decision imposed on Jani Master.
- జానీ మాస్టర్ వివాదం ముగింపు
- నాన్ కోఆపరేషన్ నిర్ణయం ఎత్తివేత
- చిరు బాలయ్య కీలక చొరవ
Jani Master Issue: సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా అలజడి రేపిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, డాన్సర్స్ యూనియన్ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. పరిశ్రమ పెద్దల ఆధ్వర్యంలో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఇరు వర్గాల మధ్య సామరస్య వాతావరణం ఏర్పడింది. తనపై వచ్చిన ఆరోపణలన్నింటికీ జానీ మాస్టర్ సుదీర్ఘ వివరణ ఇవ్వడంతో ఫెడరేషన్ సంతృప్తి చెందింది. ఈ నేపథ్యంలో గతంలో ఆయనపై విధించిన ‘నాన్ కోఆపరేషన్’ నిర్ణయాన్ని పూర్తిగా ఎత్తివేస్తూ ఫెడరేషన్ అధికారిక ప్రకటన చేసింది.
Drunk and Drive: మందుబాబులకు పోలీసుల హెచ్చరిక.. దొరికితే 10 ఏళ్ల జైలు శిక్షే.. ఇవి కూడా తెలుసుకోండి!
డాన్సర్స్ యూనియన్ అంతర్గత వివాదాలపై ఫోకస్:
ఈ కీలక సమావేశంలో జానీ మాస్టర్(Jani Master Issue) అంశంతో పాటు డాన్సర్స్ యూనియన్‌లో నెలకొన్న ఇతర అంతర్గత విభేదాలపై కూడా విస్తృతంగా చర్చించారు. యూనియన్ కార్యవర్గంపై వచ్చిన ఆరోపణలు, సస్పెన్షన్లపై త్వరలోనే సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి, ప్రజాస్వామ్య పద్ధతిలో తుది నిర్ణయం తీసుకోవాలని ఫెడరేషన్ ప్రతినిధులు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం సుమలత దేవి నేతృత్వంలోని పాత కార్యవర్గమే బాధ్యతలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై మిగిలిన సభ్యుల మెజారిటీ అభిప్రాయం మేరకే తదుపరి చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు.
రంగంలోకి చిరు, బాలయ్య.. కార్మిక సంక్షేమమే పరమావధి:
ఈ వివాదం మరింత పెద్దది కాకుండా సద్దుమణగడంలో టాలీవుడ్ అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ అత్యంత కీలక పాత్ర పోషించారు. పరిశ్రమ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యను వెంటనే సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని ఇరు హీరోలు ప్రత్యేకంగా సూచించినట్లు ప్రతినిధులు వెల్లడించారు. యూనియన్ అధ్యక్షురాలు సుమలత మాట్లాడుతూ.. తాము కేవలం శ్రమ దోపిడీకి వ్యతిరేకంగానే పోరాడామని స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమాన్ని కాపాడేందుకే ఈ రాజీ కుదిరిందని, దీంతో టాలీవుడ్‌లో మళ్లీ స్నేహపూర్వక వాతావరణం నెలకొందని నిర్మాతల మండలి సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
