Star Couple who got married in the year 2025.
Rewind 2025: ప్రతీ ఇయర్ లాగానే 2025 కూడా చాలా స్పెషల్ గా గడిచింది. కొంతమందికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాలను ఇచ్చింది. అందులో పెళ్లి అనేది చాలా ప్రత్యేకం. మరి అలాంటి ప్రత్యేకమైన ప్రయాణాన్ని 2025లో చాలా మంది స్టార్స్ మొదలుపెట్టారు ఈ ఇయర్ లో(Rewind 2025). మరి ఆ స్టార్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
Akhil Raj-Anupama:రాజు వెడ్స్ రాంబాయి హీరోకి బంపర్ ఆఫర్.. అనుపమతో మూవీ.. డైరెక్టరో ఎవరో తెలుసా?
అఖిల్- జైనబ్:
టాలీవుడ్ కింగ్ నాగార్జున రెండో కొడుకు అఖిల్ అక్కినేని ఈ ఏడాదే పెళ్లి చేసుకున్నాడు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న తన ప్రియురాలు జైనబ్‌తో కలిసి ఏడడుగులు వేశాడు. జూన్ 6వ తేదీన వీరి పెళ్లి ఘనంగా జరిగింది.
సమంత- రాజ్:
స్టార్ బ్యూటీ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు అఫీషియల్‌గా డిసెంబర్ 1న పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి కోయంబత్తూరులో ఈషా సెంటర్‌లో అతికొద్ది మంది సమక్షంలో జరిగింది. ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ ఇద్దరికీ ఇది రెండో పెళ్లే.
అవికా గోర్- మిలింద్ చంద్వానీ:
చిన్నారి పెళ్లికూతురు నటి అవికా గోర్ కూడా ఈ ఇయర్ పెళ్లి చేసుకుంది. చాలా కాలంగా రిలేషన్ లో ఉంటున్న తన ప్రియుడు మిలింద్ చంద్వానీతో సెప్టెంబర్ 30న ఈ అమ్మడు ఏడూ అడుగులు వేసింది.
అర్మాన్ మాలిక్- ఆష్న ష్రాఫ్:
సింగర్ అర్మాన్ మాలిక్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన పాటలతో ఆడియన్స్ కి ఆకట్టుకున్న ఈ సింగర్ తన ప్రియురాలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆష్న ష్రాఫ్‌ను పెళ్లి చేసుకున్నాడు. జనవరి 2న వీరి పెళ్లి ఘనంగా జరిగింది.
అభిషన్ జీవింత్- అఖిల:
టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అభిషన్ జీవింత్. ఈ దర్శకుడు కూడా 2025లోనే తన బ్యాచిలర్ లైఫ్ కి ఎండ్ కార్డు వేశాడు. తన ప్రియురాలు అఖిలను అక్టోబర్ 31న పెళ్లి చేసుకున్నాడు.
వీళ్ళే కాకుండా.. ఆశ్లేష సావంత్- సందీప్ బస్వానా, అర్చన- బీఆర్ శరత్, సారా ఖాన్- క్రిష్ పాఠక్, సెలీనా గోమెజ్-బెన్నీ బ్లాన్కో, దర్శన్ రావల్-దరల్ సురేలియా, ఆదార్ జైన్- అలేఖ అద్వానీ, ప్రతీక్ బాబర్- ప్రియా బెనర్జీ, ప్రజక్త కోహ్లి- వృషాంక్ ఖనల్.. లాంటి చాలా మంది స్టార్స్ ఈ ఇయర్ పెళ్లి చేసుకున్నారు.