Akhil Raj-Anupama:రాజు వెడ్స్ రాంబాయి హీరోకి బంపర్ ఆఫర్.. అనుపమతో మూవీ.. డైరెక్టరో ఎవరో తెలుసా?

రాజు వెడ్స్ రాంబాయి మూవీ అఖిల్ రాజ్ అనుపమ పరమేశ్వరన్(Akhil Raj-Anupama) తో కొత్త సినిమా చేస్తున్నాడు.

Akhil Raj-Anupama:రాజు వెడ్స్ రాంబాయి హీరోకి బంపర్ ఆఫర్.. అనుపమతో మూవీ.. డైరెక్టరో ఎవరో తెలుసా?

Anupama Parameswaran is acting as the heroine in Akhil Raj next movie

Updated On : December 28, 2025 / 9:12 AM IST

Akhil Raj-Anupama: అఖిల్ రాజ్.. అంటే తెలియకపోవచ్చు కానీ, రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో రాజు అంటే మాత్రం టక్కున గుర్తు పట్టేస్తారు. అంతలా తన నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు ఈ కుర్ర హీరో. ఎమోషనల్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో అంతే ఎమోషనల్ గా నటించి తన సత్తా ఏంటో చూపించాడు. అంతకుముందే చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన ఈ హీరో కి రాజు మేడ్స్ రాంబాయి తో దశ తిరిగింది అనే చెప్పాలి. ఇక రీసెంట్ గా వచ్చిన ఈషా సినిమాతో మరి హిట్ అందుకున్నాడు ఈ హీరో. దీంతో, ఈ హీరోకి అవకాశాలు క్యూ కడుతున్నాయి.

Riddhi Kumar: ప్రభాస్ నాకు చీర గిఫ్టుగా ఇచ్చారు.. అదే చీరలో ఈవెంట్ కి వచ్చాను.. రిద్ది కుమార్ క్యూట్ స్పీచ్ వైరల్

తాజా సమాచారం ప్రకారం ఒక క్రేజీ ఆఫర్ కి ఒకే చెప్పేది అఖిల్ రాజ్. ప్రముఖ నిర్మాణ సంస్థ చేస్తున్న సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకొన్నాడట. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ సినిమాలో స్టార్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Akhil Raj-Anupama) హీరోయిన్ గా నటిస్తుందని టాక్. ఇది నిజంగా గొప్ప అవకాశం అనే చెప్పాలి. కెరీర్ స్టార్టింగ్ లోనే అనుపమ లాంటి స్టార్ హీరోయిన్ తో నటించే అవకాశం రావడం అంటే మాములు విషయం కాదు. ఈ సినిమా గనక హిట్ అయ్యింది అంటే.. టాలీవుడ్ మరో క్రేజీ హీరోకి ప్లేస్ రెడీగా ఉన్నట్టే.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే, దర్శకుడు ఎవరో తెలియదు కానీ కథ మాత్రం ఒకే చేశారట. ప్యూర్ ఎమోషనల్ బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది అని టాక్ నడుస్తోంది. త్వరలోనే షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల అవుతుందని సమాచారం.