Anupama Parameswaran is acting as the heroine in Akhil Raj next movie
Akhil Raj-Anupama: అఖిల్ రాజ్.. అంటే తెలియకపోవచ్చు కానీ, రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో రాజు అంటే మాత్రం టక్కున గుర్తు పట్టేస్తారు. అంతలా తన నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు ఈ కుర్ర హీరో. ఎమోషనల్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో అంతే ఎమోషనల్ గా నటించి తన సత్తా ఏంటో చూపించాడు. అంతకుముందే చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన ఈ హీరో కి రాజు మేడ్స్ రాంబాయి తో దశ తిరిగింది అనే చెప్పాలి. ఇక రీసెంట్ గా వచ్చిన ఈషా సినిమాతో మరి హిట్ అందుకున్నాడు ఈ హీరో. దీంతో, ఈ హీరోకి అవకాశాలు క్యూ కడుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ఒక క్రేజీ ఆఫర్ కి ఒకే చెప్పేది అఖిల్ రాజ్. ప్రముఖ నిర్మాణ సంస్థ చేస్తున్న సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకొన్నాడట. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ సినిమాలో స్టార్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Akhil Raj-Anupama) హీరోయిన్ గా నటిస్తుందని టాక్. ఇది నిజంగా గొప్ప అవకాశం అనే చెప్పాలి. కెరీర్ స్టార్టింగ్ లోనే అనుపమ లాంటి స్టార్ హీరోయిన్ తో నటించే అవకాశం రావడం అంటే మాములు విషయం కాదు. ఈ సినిమా గనక హిట్ అయ్యింది అంటే.. టాలీవుడ్ మరో క్రేజీ హీరోకి ప్లేస్ రెడీగా ఉన్నట్టే.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే, దర్శకుడు ఎవరో తెలియదు కానీ కథ మాత్రం ఒకే చేశారట. ప్యూర్ ఎమోషనల్ బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది అని టాక్ నడుస్తోంది. త్వరలోనే షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల అవుతుందని సమాచారం.