Riddhi Kumar: ప్రభాస్ నాకు చీర గిఫ్టుగా ఇచ్చారు.. అదే చీరలో ఈవెంట్ కి వచ్చాను.. రిద్ది కుమార్ క్యూట్ స్పీచ్ వైరల్

ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రద్దీ కుమార్(Riddhi Kumar) చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Riddhi Kumar: ప్రభాస్ నాకు చీర గిఫ్టుగా ఇచ్చారు.. అదే చీరలో ఈవెంట్ కి వచ్చాను.. రిద్ది కుమార్ క్యూట్ స్పీచ్ వైరల్

heroine Riddhi Kumar cute comments at The Raja Saab pre-release event

Updated On : December 28, 2025 / 8:15 AM IST

Riddhi Kumar: ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్. కామెడీ చిత్రాల దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తాన్న ఈ సినిమాను పీపుల్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రద్దీ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రభాస్ తన కెరీర్ లో మొదటిసారి హారర్ అండ్ కామెడీ జానర్ లో సినిమా చేస్తుందటమ్ తో ది రాజాసాబ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Jana Nayagan: ఇక్కడ అవి వద్దమ్మా.. అభిమానులకు విజయ్ స్వీట్ వార్నింగ్

ఇందులో భాగంగానే తాజాగా రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా జరిగిన ఈ ఈవెంట్ కి చిత్ర యూనిట్ తోపాటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే, ఈ ఈవెంట్ లో హీరోయిన్ రద్దీ కుమార్(Riddhi Kumar) చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఈవెంట్ లో ఆమె మాట్లాడుతూ.. “ప్రభాస్ గారితో రాజాసాబ్ సినిమా చేయటం చాలా సంతోషంగా ఉంది. మూడు సంవత్సరాల క్రితం ఆయన నాకు కానుకగా ఒక చీరను ఇచ్చారు. అది నాకు చాలా స్పెషల్ అందుకే ఈరోజు ఈవెంట్ కు ప్రభాస్ ఇచ్చిన చీరలోనే వచ్చాను” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ప్రభాస్.. ప్రభాస్.. అంటూ అరిచారు. దీంతో ఆ వీడియో కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.