Jana Nayagan: ఇక్కడ అవి వద్దమ్మా.. అభిమానులకు విజయ్ స్వీట్ వార్నింగ్

తమిళ స్టార్ విజయ్ తలపతి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్(Jana Nayagan). దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Jana Nayagan: ఇక్కడ అవి వద్దమ్మా.. అభిమానులకు విజయ్ స్వీట్ వార్నింగ్

Hero Vijay Thalapathy interesting comments at the Jana Nayagan movie event

Updated On : December 28, 2025 / 7:03 AM IST

Jana Nayagan: తమిళ స్టార్ విజయ్ తలపతి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్(Jana Nayagan). ఇదే సినిమాను తెలుగులో జన నాయకుడు పేరుతో విడుదల చేస్తున్నారు. దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం రాజకీయాల్లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న విజయ్ కి ఇదే లాస్ట్ సినిమా అవడం విశేషం. అందుకే, జన నాయగన్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు మేకర్స్. అయితే, ఈ ఈవెంట్ ను ఇండియాలో కాకుండా మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో నిర్వచించారు. ఎంతో భారీగా జరిగిన ఈ ఈవెంట్ కి దేశవిదేశాల నుంచి విజయ్ అభిమానులు అక్కడకు చేరుకున్నారు.

Roshan: భారీ ఆఫర్స్ కొట్టేస్తున్న రోషన్.. లిస్టులో రెండు బడా బ్యానర్స్.. గీతా ఆర్ట్స్ లో ఒక సినిమా

అయితే, ఈ ఈవెంట్ లో మాట్లాడటానికి విజయ్ స్టేజిపైకి రాగానే ఆయన అభిమానులు అంతా ‘టీవీకే.. టీవీకే’ అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. దానికి విజయ్ కాస్త అసహనానికి లోనయ్యారు. ఇది సినిమా ఫంక్షన్.. ఇక్కడ రాజకీయాల గురించి వద్దు అన్నట్టుగా.. ఇక్కడ అవి వద్దమ్మా అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు విజయ్. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు, చాలా మంది విజయ్ అభిమానులు టీవీకే పార్ట్ జండాలతో ఈవెంట్ ప్రాంగణంలోకి రావాలని ప్రయత్నించారు. కానీ , మలేషియన్ పోలీస్ లు వారిని అడ్డుకున్నారు.

ఇక, జన నాయగన్ సినిమా విషయానికి వస్తే, తెలుగులో బాలకృష్ణ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ గా ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. మమిత బైజు విజయ్ కూతురిగా నటిస్తోంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు ఒక రేంజ్ లో హిట్ అయ్యాయి. మరి విజయ్ నటిస్తున్న ఈ చివరి సినిమా ఆయన ఫ్యాన్స్ ని ఏ రేంజ్ లో మెప్పిస్తుంది అనేది చూడాలి.