Roshan: భారీ ఆఫర్స్ కొట్టేస్తున్న రోషన్.. లిస్టులో రెండు బడా బ్యానర్స్.. గీతా ఆర్ట్స్ లో ఒక సినిమా
హీరో శ్రీకాంత్ కొడుకుగా టాలీవడ్ లో ఎంట్రీ ఇచ్చాడు రోషన్(Roshan). మొదటి సినిమా పెళ్లి సందDలో తన నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. రీసెంట్ గా ఈ హీరో చేసిన సినిమా ఛాంపియన్.
Hero Roshan Meka Doing his next movie under Geetha Arts banner
Roshan: హీరో శ్రీకాంత్ కొడుకుగా టాలీవడ్ లో ఎంట్రీ ఇచ్చాడు రోషన్. మొదటి సినిమా పెళ్లి సందDలో తన నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. రీసెంట్ గా ఈ హీరో చేసిన సినిమా ఛాంపియన్. దర్శకుడు ప్రదీప్ అద్వైతం తెరకెక్కించిన ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాను స్వప్న సినిమాస్ పై స్వప్న దత్ నిర్మించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. దీంతో, కలక్షన్స్ కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. విమర్శకుల నుంచి కూడా ఈ సినిమాకు ప్రశంసలు దక్కుతున్నాయి.
Teja Sajja: వైలెన్స్ ముందు వచ్చే సైలెన్స్.. తేజ సజ్జా మాస్టర్ ప్లాన్.. ఇది కదా లైనప్ అంటే..
ఇక తాజాగా ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ నిర్మాత అల్లు అరవింద్ చూశారు. అనంతరం రోషన్(Roshan) తో మాట్లాడారు. సినిమా చాలా బాగుంది అంటూ, రోషన్ చాలా బాగా నటించాడు అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇందులో భాగంగానే రోషన్ తన నెక్స్ట్ సినిమాను గీతా ఆర్ట్స్ లో చేస్తున్నాడు అంటూ ప్రకటించాడు అల్లు అరవింద్. అయితే, ఈ ప్రాజెక్టుకి సంబందించిన ఆ దర్శకుడు ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కేవలం గీతా ఆర్ట్స్ మాత్రమే కాదు మరో టాప్ ప్రొడక్షన్ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ లో కూడా ఒక సినిమా చేయనున్నాడు రోషన్. దీనికి సంబందించిన కథ చర్చలు కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయని సమాచారం.
త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది అని టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న టాక్. అయితే. కెరీర్ స్టార్టింగ్ లోనే ఇలా పెద్ద పెద్ద సంస్థల్లో సినిమాలు చేయడం, ఆఫర్స్ రావడం అంటే మాములు విషయం కాదు. ఇప్పటికే ఛాంపియన్ సినిమాకు సూపర్ హిట్ అయ్యింది. రానున్న రెండు సినిమాలు కూడా హిట్ అయ్యాయి అంటే రోషన్ స్టార్ హీరోగా ఎదిగినట్టే. మరి ఆ రెండు సినిమాలు ఈ కూర హీరోకి ఎలాంటి రిజల్ట్ ఇస్తాయి అనేది చూడాలి.
