RGV : నా లైఫ్ లో నేను కౌగిలించుకున్న ఏకైక మగాడు అతనే.. ఆర్జీవీ వ్యాఖ్యలు.. ఇంతకీ ఆ మగాడు ఎవరు..?

ఆర్జీవీ త్వరలో శారీ సినిమాతో రాబోతున్నాడు.

RGV Hugged First Men his Comments goes Viral

RGV : ఆర్జీవీ అంటేనే కాంట్రవర్సీలకు, వైరల్ కంటెంట్ కి కేరాఫ్ అడ్రెస్. తన సినిమాలు, తన ట్వీట్స్, తన స్పీచ్ లతో కూడా వైరల్ అవుతూ ఉంటాడు ఆర్జీవీ. ఆర్జీవీ త్వరలో శారీ సినిమాతో రాబోతున్నాడు. ఆరాధ్య దేవి మెయిన్ లీడ్ గా తెరకెక్కుతున్న శారీ సినిమా మార్చ్ 21న థియేటర్స్ లోకి రానుంది. దీంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

తాజాగా ఆరాధ్య దేవి, ఆర్జీవీ, సినిమా హీరో, డైరెక్టర్.. మల్లారెడ్డి కాలేజీలో ప్రెస్ మీట్ నిర్వహించి అక్కడి స్టూడెంట్స్ తో మాట్లాడారు. స్టూడెంట్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అయితే ఓ స్టూడెంట్ తాను ఆర్జీవికి పెద్ద ఫ్యాన్ అని ఒక్క హగ్ ఇమ్మని కోరగా మొదట ఆర్జీవీ నో చెప్పి, నేను అబ్బాయిలకు హగ్ ఇవ్వను, ఇప్పటివరకు ఒక్కసారి కూడా అబ్బాయిలకు హగ్ ఇవ్వలేదు. నేను అమ్మాయిలకే హగ్ ఇస్తాను అని చెప్పాడు.

Also Read : Nani – Chiranjeevi : నాగ చైతన్య పెళ్ళికి వెళ్తే.. చిరంజీవి గారు నన్ను అలా పిలిచేసరికి.. నాని ఆసక్తికర కామెంట్స్..

అయితే ఆ స్టూడెంట్ స్టేజిపైకి వచ్చి ఆర్జీవీ సినిమాలు, ఆర్జీవీ అంటే ఎంత ఇష్టమో ఎమోషనల్ గా మాట్లాడాడు. మాట్లాడి వెళ్లిపోతుంటే ఆర్జీవీ పిలిచి మరీ ఆ స్టూడెంట్ కి హగ్ ఇచ్చాడు. దీంతో అక్కడున్నవాళ్లంతా అరుపులతో సందడి చేసాడు. ఆ అబ్బాయికి హగ్ ఇచ్చాక ఆర్జీవీ.. ఇంతవరకు నా లైఫ్ లో నేను కౌగిలించుకున్న ఏకైక మగాడు అతను అని చెప్పారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

ఆ అబ్బాయిని ఆర్జీవీ కౌగిలించుకున్న వీడియోలు వైరల్ అవ్వగా, మల్లారెడ్డి కాలేజీ స్టూడెంట్ లక్ అని, ఆర్జీవిని హగ్ చేసుకునే అదృష్టం వచ్చిందని ఆర్జీవీ ఫ్యాన్స్ అంటున్నారు. మొత్తానికి నేను కౌగిలించుకున్న ఏకైక మొగాడు అని ఆర్జీవీ స్టేట్మెంట్ తో ఆ అబ్బాయి కూడా వైరల్ అవుతున్నాడు. ఆర్జీవీ ఏం చేసినా వైరల్ అవ్వాల్సిందే.