వర్మ పబ్లిసిటీ స్టంట్.. ‘పవర్‌స్టార్’ ట్రైలర్ లీక్..

  • Publish Date - July 22, 2020 / 11:31 AM IST

తన సినిమాని జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలి.. సినిమా విడుదలకు ముందు ఎలాంటి హైప్ క్రియేట్ చేయాలి.. సినిమా గురించి ఎలాంటి కాంట్రవర్సీ క్రియేట్ చేయాలనే విషయాలు వర్మకు వెన్నతో పెట్టిన విద్య. ఆర్జీవీ తాజా చిత్రం ‘పవర్‌స్టార్’ ట్రైలర్ జూలై 22 ఉదయం 11 గంటలకు RGV వరల్డ్‌ థియేటర్లో రిలీజ్ చేస్తానని రూ.25 టికెట్ రేటు కూడా పెట్టాడు. కట్ చేస్తే 22 ఉదయం
పవర్‌‌స్టార్ సినిమా ట్రైలర్ ఓ YouTube channelలో రిలీజ్ అయిపోయింది.

కొద్ది సేపటికి ఓ యూట్యూబ్ ఛానెల్‌లో తన సినిమా ట్రైలర్ లీక్ అయ్యింది అంటూ వర్మ ట్వీట్ చేశాడు. ట్రైలర్ లీక్ అయ్యింది కాబట్టి ఆ అమౌంట్ తిరిగి ఇచ్చేస్తానని చెబుతూ జనాల్ని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఇదంతా పబ్లిసిటీలో భాగమేనంటూ వర్మ రైవల్స్ కొందరు చెప్పడం విశేషం. ఎలాగో ఫ్రీ గా వస్తుంది కదా అని కక్కుర్తి పడి కొందరు ట్రైలర్ చూశారు కానీ తానైతే అఫీషియల్‌గా రిలీజ్ చేస్తానని అప్పటివరకు వెయిట్ చేయమని చెప్తున్నాడు వర్మ.