RGV : ఫిల్మ్ ఇనిస్టిట్యూట్స్ పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు.. అవన్నీ వేస్ట్.. మీకు ట్యాలెంటు ఉంటే నా దగ్గరికి రండి..

ఆర్జీవీ ఫిలిం ఇనిస్టిట్యూట్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫిలిం ఇనిస్టిట్యూట్స్ అన్ని వేస్ట్ అంటూ ట్వీట్ చేశాడు ఆర్జీవీ. దీంతో ఆర్జీవీ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

RGV Sensational Comments on Film Institutes goes viral

RGV Comments  : సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ(Rgv) ఇటీవల కొత్త ఆఫీస్ కట్టాను అంటూ ‘ఆర్జీవీ డెన్’ వీడియోలు తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేయడంతో ఆ ఆఫీస్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒక్కసారిగా RGV డెన్ వైరల్ గా మారింది. ఆర్జీవీ డెన్ అనే పేరుతోనే ఆర్వీ గ్రూప్ తో కలిసి ఓ నిర్మాణ సంస్థని కూడా స్థాపించారు. ఈ ఆర్జీవీ డెన్ తో ట్యాలెంట్ ఉన్నవాళ్లకు, కొత్తవాళ్లకు సినిమా, వెబ్ సిరీస్ లలో అవకాశాలు ఇస్తామని గతంలో ప్రకటించి తాజాగా అవకాశాలు ఎలా ఇస్తారో, ఎలా అప్లై చేయాలో తెలుపుతూ ఆర్జీవీ ప్రకటించారు. ఆర్జీవీ డెన్ కి ఒక వెబ్‌సైట్ రూపొందించారు. ఇందులో డైరెక్టర్స్, రైటర్స్, కెమెరామెన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ కి ప్రస్తుతం అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు. మిగిలిన కేటగిరీలలో కూడా త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని అన్నారు. ట్యాలెంట్, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఆ వెబ్‌సైట్ కి వెళ్లి అప్లై చేసుకోండని ఆర్జీవీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆర్జీవీ డెన్, ఈ అవకాశాల గురించి ఆర్జీవీ వరుస పోస్టులు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆర్జీవీ ఫిలిం ఇనిస్టిట్యూట్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫిలిం ఇనిస్టిట్యూట్స్ అన్ని వేస్ట్ అంటూ ట్వీట్ చేశాడు ఆర్జీవీ. దీంతో ఆర్జీవీ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

ఆర్జీవీ తన ట్వీట్ లో.. చాలా మంది వాళ్ళకి ఇష్టమైన పని అక్కడి నుంచి దొరుకుతుందని, సరైన అవగాహన లేకుండా ఫిలిం ఇనిస్టిట్యూట్స్ లో చేరతారు. ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లు ఒక వ్యవస్థగా పాతబడిపోయాయి. డైరెక్టర్‌ అవ్వడానికి అసిస్టెంట్ డైరెక్టర్‌లుగా పనిచేయాలని ఫిలిం ఇన్స్టిట్యూట్స్ చెప్తాయి. అది ఒక జోక్. ఉదాహరణకు శేఖర్ కపూర్, మణిరత్నం మరియు నేను ఎప్పుడూ అసిస్టెంట్‌లుగా పని చేయలేదు. నేను ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ల నుండి బయటకు వచ్చిన చాలా మంది నటీనటులు మరియు దర్శకులను కలుస్తూనే ఉంటాను. వారి శిక్షణలో మొత్తం ప్రస్తుత చలనచిత్ర పరిశ్రమ ఎలా పని చేస్తుందనే సందర్భంలో వాళ్ళు చాలా తప్పు ఆలోచనతో ఉన్నారని అర్థమైంది. కానీ అసలు సమస్య ఏంటంటే ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లు ఇంకా సినిమాలు కళా రూపం నుంచి కమర్షియల్ కి మారాయని గుర్తించట్లేదు. కొంతమంది ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లు సినిమా ఇండస్ట్రీ ఎంట్రీకి బాగా పనికొస్తాయని అనుకుంటున్నారు. కానీ అది తప్పు. మెడికల్ లేదా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌ను చూశాను కానీ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ గ్రాడ్యుయేట్‌ను సీరియస్‌గా తీసుకున్న వాళ్ళు ఎదిగినట్టు నేను చూడలేదు. గతంలో ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ల ద్వారా ప్రపంచ స్థాయి చిత్రాలు తెలుసుకోవచ్చు, సినిమాలు తీయొచ్చు, ఎక్యుప్మెంట్ ఇస్తాయి అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు అంతా నెట్ లోనే అన్ని సినిమాలు దొరుకుతున్నాయి. కేవలం ఫోన్‌తో కావలసిన సినిమాని చేయొచ్చు. ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయి టైం, డబ్బు ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని అన్నారు.

అలాగే.. కొంతమంది ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులతో నేను ఇంటరాక్షన్ అయినప్పుడు వాళ్ళు పూర్తిగా గందరగోళంగా ఉన్నారు. వాళ్ళు రియాలిటీలో బతకట్లేదు. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఆర్ట్ ఫామ్ లో ఉంటున్నారు. సినిమాలు ఎప్పుడూ భావవ్యక్తీకరణగా ఉంటాయి. ఇప్పుడు టెక్నాలజీని వాడుకొని సినిమాలుతీయాలి. కానీ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లు దానిని పాడు చేస్తున్నాయి. అందుకే ఈ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ల గోల లేకుండా మీకు ఇంట్రస్ట్, ట్యాలెంట్ ఉంటే http://rgvden.com సైట్ లోకి రండి. ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లలో నేర్చుకునేదంతా ఒకే దెబ్బకి ఇక్కడ నేర్చుకోవచ్చు. ఎలాంటి ప్రాసెస్ లేకుండా డైరెక్ట్ సినిమాని షూట్ చేసేయండి అని అన్నారు. దీంతో ఆర్జీవీ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లపై చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అయి టాలీవుడ్ లో చర్చగా మారాయి.

RGV DEN : ఆర్జీవీ ఏం ప్లాన్ చేస్తున్నాడు..? ఇంకో సినిమా ఇండస్ట్రీ తయారు చేస్తున్నాడా?

ఇక ఆర్జీవీ తన శివ సినిమా అప్పటి ఫోటో షేర్ చేసి.. ఈ ఫొటోలో ఉన్న నాకు శివ సినిమాతో డెబ్యూ ఇవ్వడానికి కారణం సినిమా పరిశ్రమ వ్యక్తులే. కానీ నాకంటే ఇంకా ట్యాలెంటెడ్ వ్యక్తులు ఇంకా బయట చాలా మంది ఉన్నారు. వాళ్లందరికీ ఇదే అవకాశం వచ్చి సినిమాలు చేయండి అని అన్నారు ఆర్జీవీ.