RGV War 2
RGV War 2 : ఇటీవల ఎన్టీఆర్ – హృతిక్ కలిసి వార్ 2 అనే బాలీవుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రొటీన్ కథ, కథనంతో కొన్ని భారీ యాక్షన్స్ తో ఉండటంతో ప్రేక్షకులని మెప్పించలేక యావరేజ్ గా నిలిచింది. వార్ 2 సినిమా ఇంకా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. తాజాగా వార్ 2 సినిమాపై ఆర్జీవీ వ్యాఖ్యలు చేశారు.(RGV War 2)
ఆర్జీవీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇటీవల వార్ 2 సినిమా చూసాను. ఓపెనింగ్ సీన్ హృతిక్ రోషన్ జపాన్ వాళ్ళతో ఫైట్ చేస్తాడు. ఓ 50 మంది జపాన్ యోధులను కొట్టేస్తాడు. అసలు ఆ ఫైట్ ఎందుకు? జపాన్ వాళ్ళు ఏం చేసారు అనేది ఏమి చూపించరు. పోనీ జపాన్ మనకు శత్రుదేశం కూడా కాదు, మనకు మిత్ర దేశమే. ఏ పాకిస్థాన్ మీదో ఫైట్ చేసి ఉంటే లాజిక్ అవసర్లేదు. ఇండియా స్పై సినిమాలు అంటే ఇండియా శత్రుదేశాలతో పోరాడాలి, మిత్ర దేశంతో కాదు. కానీ లాజిక్ లేకుండా, కారణం చెప్పకుండా హీరో వెళ్లి జపాన్ వాళ్ళతో ఫైట్ చేస్తాడు. నేను ఆ మూవీ యూనిట్ లో తెలిసినవాళ్లను అడిగాను ఈ ఫైట్ ఎందుకు అంటే వాళ్ళు కేవలం హీరో ఎలివేషన్, విజువల్స్ కోసం, జపాన్ అయితే కొత్తగా ఉంటుందని, అందుకే పెట్టాము అని చెప్పాడు. అంతే కానీ ఎక్కడా కథ కోసం అని చెప్పలేదు.
Also Read : Pandu Master : ఆ శివయ్యే వచ్చి నాకు ఇరుముళ్ళు కట్టాడు.. అక్కడికి వెళ్లొచ్చాక..
ఆ ఒక్క సినిమానే కాదు ఇటీవల చాలా సినిమాలు అలాగే చేస్తున్నారు. పాన్ ఇండియా పిచ్చిలో పడి ఫోర్స్ హీరోయిజం చూపిస్తున్నారు కథకు సంబంధం లేకుండా. హీరోని పైకి లేపడానికి కథని చంపేస్తున్నారని దర్శకులు కూడా ఆలోచించట్లేదు అని అన్నారు. దీంతో ఆర్జీవీ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా నిజమే కదా కథేమీ లేకుండా ఇటీవల చాలా సినిమాల్లో కేవలం ఎలివేషన్స్ కోసమే ఫైట్స్ పెడుతున్నారు అని అంటున్నారు.