RGV – Sandeep Reddy Vanga : ఒకప్పటి సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ ఇప్పుడు మాత్రం తనిష్టం అంటూ తనకి నచ్చిన సినిమాలు చేసుకుంటున్నాడు. కానీ ఆర్జీవీని ప్రేరణగా తీసుకొని ఎంతోమంది సినీ పరిశ్రమలోకి డైరెక్టర్స్ అవ్వాలని వచ్చారు. ఇప్పటికి చాలా మంది ఆర్జీవీ ఫ్యాన్స్ ఉన్నారు. సినీ పరిశ్రమలో కూడా చాలామంది టెక్నిషియన్స్ ఆర్జీవీ అభిమానులే. అందులో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఒకరు.
తీసిన మూడు సినిమాలతోనే సందీప్ వంగ స్టార్ డైరెక్టర్ రేంజ్ కి ఎదిగారు. రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి తీసిన యానిమల్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఐఫా వేడుకల్లో యానిమల్ సినిమా బెస్ట్ ఫిలిం, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ నెగిటివ్ రోల్, బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ లిరిక్స్, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ సౌండ్ డిజైన్.. ఇన్ని విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది.
Also Read : Ram Charan – Chiranjeevi : చరణ్ వీణ స్టెప్, చిరంజీవి రిఫరెన్స్.. ‘గేమ్ ఛేంజర్’తో మెగా ఫ్యాన్స్ కి పండగే..
యానిమల్ సినిమాకు సందీప్ రెడ్డినే ఎడిటర్ కావడంతో బెస్ట్ ఎడిటింగ్ అవార్డు సందీప్ వంగ అందుకున్నాడు. ఈ క్రమంలో స్టేజి మీద సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ.. ఈ అవార్డు ఇచ్చినందుకు ఐఫాకు ధన్యవాదాలు. ఈ విభాగంలో నేను అవార్డు వస్తుందని అసలు ఎప్పుడూ ఊహించలేదు. డైరెక్టర్, నిర్మాత, రైటర్ ఇవన్నీ కాకుండా ఎడిటింగ్ లో వచ్చినందుకు సంతోషంగా ఉంది. రేర్ అవార్డు ఇది. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలి. నేను ఎడిటింగ్ కేవలం రామ్ గోపాల్ వర్మ సర్ సినిమాలు చూస్తూ నేర్చుకున్నాను. మీ సినిమాల నుంచి చాలా నేర్చుకున్నాను, థ్యాంక్యూ ఆర్జీవీ సర్ అని తెలిపారు.
దీంతో ఆర్జీవీ ఈ వీడియోని పోస్ట్ చేస్తూ.. సర్ సందీప్ రెడ్డి వంగ నేను ఇప్పుడు మీ దగ్గర ఫిలిం మేకింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను. మియా మాల్కోవా, దావూద్ ఇబ్రహీం, ఆయాండ్ ర్యాన్, మీ మీద ఒట్టేసి చెప్తున్నాను ఇది అని రిప్లై ఇచ్చారు. దీనికి సందీప్ రెడ్డి వంగ సర్.. అంటూ దండం పెట్టే ఎమోజితో రిప్లై ఇచ్చారు. మొత్తానికి సందీప్ వంగ మాటలు – ఆర్జీవీ రిప్లై సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Sir…..🙏
— Sandeep Reddy Vanga (@imvangasandeep) September 30, 2024