Ridhi Dogra : జవాన్ ప్రీవ్యూలో రిధి డోగ్రా ఎక్కడ..? ప్రశ్నిస్తున్న ఫ్యాన్స్.. ‘ఉన్నా.. ఎక్కడంటే..?..’
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) నటిస్తున్న చిత్రం జవాన్(Jawan). తమిళ డైరెక్టర్ అట్లీ(Atlee) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) విలన్‌గా నటిస్తున్నాడు.
- Thota Vamshi Kumar
- Updated on- July 11, 2023 / 07:15 PM IST
Ridhi Dogra
Ridhi Dogra-Jawan : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) నటిస్తున్న చిత్రం జవాన్(Jawan). తమిళ డైరెక్టర్ అట్లీ(Atlee) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) విలన్‌గా నటిస్తున్నాడు. నయనతార, సాన్య మల్హోత్రా, దీపికా పదుకొణే, ప్రియమణి, రిద్ది డోగ్ర, ప్రియదర్శిని రాజ్‌కుమార్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉంది. సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది.
కాగా.. నిన్న (జూలై 10 సోమవారం) జవాన్ ప్రివ్యూ ట్రైలర్ విడుదలైంది. 2 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్లో ఈ చిత్రంలో నటిస్తున్న నటులు అందరూ కనిపించారు. అయితే.. నటి రిధి డోగ్రా మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆమె అభిమానులు నిరాశచెందారు. ఈ విషయం పై వారు నటిని ట్యాగ్ చేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పలువురు ఫ్యాన్స్ చేసిన ట్వీట్లపై రిధి డోగ్రా స్పందించడంతో పాటు వారిని ఆటపట్టించింది.
Mahnoor Baloch : షారుఖ్ ఖాన్‌కు నటన రాదు.. పెద్ద అందగాడేం కాదు.. నటి సంచలన వ్యాఖ్యలు
ట్రైలర్‌ను దాదాపు 30 సార్లు చూశాను. అయితే.. ఇందులో మీరు ఎక్కడా కనిపించలేదు అని ఓ నెటీజన్ ట్వీట్ చేయగా.. మీరు SRK(షారుఖ్ ఖాన్)ని 30 సార్లు చూశారు ఇంతకన్నా ఇంకేం కావాలి అంటూ సమాధానం ఇచ్చింది.
Ashish Vidyarthi : రెండో భార్యతో హనీమూన్‌లో ఆశిష్ విద్యార్థి..! ముసలోడే కానీ..
మరో నెటీజన్కు సమాధానం ఇస్తూ.. ‘ట్రైలర్లో నేను ఉన్నాను. ఆ విషయం నాకు మాత్రమే తెలుసు. అయితే ఎక్కడ ఉన్నానో మాత్రం చెప్పను.’ అంటూ ఆట పట్టించింది.
కొందరు నెటీజన్లు మాత్రం పాపను పట్టుకుని ప్రపంచానికి పరిచయం చేసిన పోలీసు అధికారి రిధి అయి ఉంటుందని ఊహిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. జవాన్ ట్రైలర్‌ను షేర్ చేస్తున్నపుడు రిధి దర్శకుడు అట్లీ పోస్ట్‌ను రీ ట్వీట్ చేసింది. ఈ చిత్రంలో తనను కూడా భాగం చేసినందుకు దర్శకుడికి కృతజ్ఞతలు చెప్పింది. రిధి ఇంతకుముందు ‘అసుర్ 2’ , ‘బద్దమీజ్ దిల్’ వంటి ప్రాజెక్ట్‌లలో కనిపించింది. ఆమె ‘టైగర్ 3’లో కనిపించనుంది.
