Mahnoor Baloch : షారుఖ్ ఖాన్‌కు నటన రాదు.. పెద్ద అందగాడేం కాదు.. నటి సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)పై పాకిస్తాన్‌కు చెందిన నటి సంచలన వ్యాఖ్యలు చేసింది. షారుఖ్‌కు నటన రాదని, అతడు పెద్ద అందగాడు ఏం కాదంటూ చెప్పుకొచ్చింది.

Pakistani actress Mahnoor Baloch
Actress Mahnoor Baloch : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)పై పాకిస్తాన్‌కు చెందిన నటి సంచలన వ్యాఖ్యలు చేసింది. షారుఖ్‌కు నటన రాదని, అతడు పెద్ద అందగాడు ఏం కాదంటూ చెప్పుకొచ్చింది. అతడో వ్యాపారవేత్త అని, తనను తాను ఎలా ప్రమోట్ చేసుకోవాలంటూ ఆయనకు బాగా తెలుసని అంది. నటి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారగా షారుఖ్ అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు. ఆమె మరెవరో కాదు నటి మహనూర్ బలోచ్ (Mahnoor Baloch).
మహనూర్ బలోచ్ అమెరికాలో జన్మించిన కెనడియన్ పాకిస్థానీ నటి. మాజీ మోడల్, దర్శకురాలు. 1993లో డ్రామా సీరియల్ మార్వితో టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది. 2013లో హాలీవుడ్‌లో అడుగుపెట్టింది. టోర్న్ సినిమాలో మర్యమ్ పాత్రను పోషించింది.
Shah Rukh Khan: పబ్లిక్‌గా మహిళా అభిమాని చేసిన పనికి షాకైన షారుఖ్ ఖాన్.. ఏం చేసిందో తెలుసా..?
ఓ పాకిస్తాని టాక్ షోలో మహనూర్ బలోచ్ మాట్లాడుతూ షారుఖ్ ఖాన్ పై పలు వ్యాఖ్యలు చేసింది. షారుఖ్ ఖాన్ చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన మనిషి అని చెప్పింది. అందం పరంగా చూస్తే ఆయన పెద్ద అందగాడు మాత్రం కాదని తెలిపింది. ఆయన వ్యక్తితం, తేజస్సు చాలా బలమైనవని, అవే ఆయన్ను గొప్పవాడిని చేసినట్లు చెప్పుకొచ్చింది. సమాజంలో ఎంతో మంది అందగాళ్లు ఉంటారని, ఆకర్షించే తేజస్సు, చలాకీతనం లేక అనామకులుగా మిగిలిపోతున్నారంది.
తన అభిప్రాయం ప్రకారం షారుఖ్ ఖాన్‌కు నటన రాదని చెప్పింది. అయితే.. ఆయనో గొప్ప బిజినెస్ మ్యాన్. తనను తాను ఎలా మార్కెట్ చేసుకోవాలో బాగా తెలుసుకు. ఈ విషయంలో షారుక్ అభిమానులు, కొందరు నాతో ఏకీభవించకపోవచ్చు కానీ అవే నిజాలు అంటూ మహనూర్ బలోచ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. చిత్ర పరిశ్రమలో ఎంతో మంది నటులు ఉన్నప్పటికీ షారుక్‌లాగా వాళ్లు సక్సెస్ కాలేకపోయారంది.
Salaar : టీజర్‌తో కేజీఎఫ్ 2 రికార్డు బద్దలుకొట్టిన సలార్.. మొదటి 5లో నాలుగు ప్రభాస్ పేరునే..
ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నటిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పబ్లిసిటీ కోసమే ఆమె షారుఖ్ ఖాన్ పై విమర్శలు చేసిందని పలువురు నెటీజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. షారుఖ్ ఖాన్ నటిస్తున్న చిత్రం ‘ జవాన్ ‘ విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్. సెప్టెంబర్ 7 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తెలుగు, హిందీ, తమిళ బాషల్లో రానుంది.