Telugu States Water Disputes: గట్టెక్కేది ఎలా? రేవంత్ సర్కార్‌కు హెడెక్‌గా మారిన నీళ్ల లొల్లి

ఏపీ, తెలంగాణ మధ్య నీళ్ల లొల్లి ఇప్పటిది కాదు. ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియదు. కానీ ఎప్పటికప్పుడు పొలిటికల్ ఎజెండాగా మారుతూ..వాటర్ వార్‌ తెలుగు స్టేట్స్‌ పాలిటిక్స్‌లో వేడిని రాజేస్తుంటుంది.

Telugu States Water Disputes: గట్టెక్కేది ఎలా? రేవంత్ సర్కార్‌కు హెడెక్‌గా మారిన నీళ్ల లొల్లి

Chandrababu Revanth Representative Image (Image Credit To Original Source)

Updated On : January 13, 2026 / 9:56 PM IST
  • నల్లమలసాగర్ ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు ఎత్తులు
  • తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదన్న సుప్రీం
  • సుప్రీం కామెంట్స్‌తో రేవంత్‌ సర్కార్‌పై విపక్షాల అటాక్
  • చంద్రబాబుకు సంక్రాంతి కానుక ఇచ్చారంటూ అటాక్
  • సుప్రీం వ్యాఖ్యలు, విపక్షాల విమర్శలతో డైలమాలో సర్కార్

 

Telugu States Water Disputes: పొలిటికల్‌ ఫైట్‌లో వాటర్‌ వార్‌ హీట్‌ను పెంచేస్తోంది. కృష్ణా జలాల వివాదంపై టూ స్టేట్స్‌ మధ్య చినికి చినికి గాలి వానలా మారుతోంది. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం టు నల్లమలసాగర్ ప్రాజెక్టు చుట్టూ..తెలంగాణ పాలిటిక్స్‌లో దుమారం రేగుతోంది. నల్లమలసాగర్‌ను అడ్డుకునేందుకు తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే..అది కాస్త రివర్స్ అయిందట. దాంతో నీళ్ల లొల్లి మరింత రాజుకుంటుంది. రేవంత్‌ సర్కార్‌ది చేతగాని తనమంటూ విపక్షాలు విరుచుకుపడుతుంటే..నెక్స్ట్‌ ఏం చేద్దామంటూ సర్కార్‌ తలల పట్టుకుంటోందట. కృష్ణా వాటర్‌ ఇష్యూ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది?

ఏపీ, తెలంగాణ మధ్య నీళ్ల లొల్లి ఇప్పటిది కాదు. ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియదు. కానీ ఎప్పటికప్పుడు పొలిటికల్ ఎజెండాగా మారుతూ..వాటర్ వార్‌ తెలుగు స్టేట్స్‌ పాలిటిక్స్‌లో వేడిని రాజేస్తుంటుంది. కొన్నాళ్లుగా కృష్ణానదీ జలాల చుట్టూ పెద్ద రచ్చే జరుగుతోంది. ఏపీ ప్రభుత్వం గోదావరి నదిని పోలవరం నుంచి కృష్ణా బేసిన్‌లోని నల్లమలసాగర్‌కు తరలించేందుకు కొత్త ప్రాజెక్టును తలపెట్టింది. ఈ నల్లమలసాగర్‌ ప్రాజెక్టు పూర్తైతే తెలంగాణకు తీవ్ర అన్యాయమంటూ..తెలంగాణ సర్కార్‌తో పాటు ఇక్కడి విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే నల్లమలసాగర్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు తలుపుతట్టింది రేవంత్ ప్రభుత్వం.

కేటాయించిన నీటి కంటే ఎక్కువగా వాటర్‌ను తరలించుకునే ఏపీకి ప్రయత్నం చేస్తుందంటూ పిటిషన్‌లో పేర్కొంది. ఎలాంటి అనుమతులు లేకున్నా ఏపీ సర్కార్‌ కొత్త ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టిందని ఆరోపించింది. అయితే వాదనలన్నీ విన్న తర్వాత తెలంగాణ ప్రభుత్వం వేసిన రిట్‌ పిటిషన్‌కు విచారణ అర్హత లేదంటూ కోర్టు తోసిపుచ్చింది. దీంతో సివిల్ సూట్ వేస్తామంటూ..పిటిషన్‌ను ఉపసంహరించుకుంది రేవంత్ సర్కార్.

రేవంత్ ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు రిజెక్ట్ చేయడంతో పొలిటికల్‌గా పెద్ద దుమారం రేగుతుంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభిషేక్ సింగ్వీ లాంటి సీనియర్ అడ్వకేట్లను పెట్టడంతో పాటు..స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ముంబై వెళ్లి కూడా ఆయనతో ప్రత్యేకంగా చర్చలు కూడా జరిపారు. ఎట్టి పరిస్థితిలో ఏపీ చేపడుతున్న ప్రాజెక్టును అడ్డుకోవాలని ప్రయత్నాలు చేశారు. కానీ ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా..పిటిషన్‌ను కోర్టు రిజెక్ట్ చేయడంతో మళ్లీ ప్రతిపక్షాలకు టార్గెట్ అయిపోయింది కాంగ్రెస్ సర్కార్.

చంద్రబాబుకు రేవంత్ సంక్రాంతి కానుక..!

మాజీ ఇరిగేషన్ మినిస్టర్ హరీశ్‌రావు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రాపర్‌గా పిటిషన్ వేయకుండా..చంద్రబాబుకు సంక్రాంతి కానుక ఇచ్చేందుకు రేవంత్ ఆరాడపడ్డట్లు ఉందని అటాక్ చేశారు. దీంతో రేవంత్ సర్కార్ తొందరపడి రిట్ పిటిషన్ వేసిందనే అపవాదు మూట కట్టుకోవాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు కామెంట్స్‌తో ఏపీ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది.

ఏపీ చేపట్టే ప్రాజెక్టు విషయంలో ఇకనైనా జాగ్రత్తగా డీల్ చేయకపోతే మరిన్ని విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుందనే ఆలోచనలో పడిందట తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే నీటి వివాదం సెంటిమెంట్‌గా మారిన నేపథ్యంలో ఇష్యూను కేర్‌ ఫుల్‌గా..సేఫ్‌ ల్యాండింగ్‌ కోసం ట్రై చేస్తోందట. నెక్స్ట్ దాఖలు చేయబోయే సివిల్ సూట్‌లో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ముందుకు పోవాలని భావిస్తోందట. రిట్ పిటిషన్ సందర్భంగా జరిగిన తప్పిదాలను..సివిల్‌ సూట్‌లో రిపీట్‌ కానివ్వొద్దని అనుకుంటున్నారట. నెక్స్ట్ వేయబోయే సివిల్ సూట్‌లోనైనా రేవంత్ సర్కార్‌ అనుకున్న ఫలితాలను సాధిస్తుందా లేదా అనేది చూడాలి.

Also Read: ఆందోళన వద్దు.. అందరికీ టికెట్‌..! కేసీఆర్ ధీమా వెనుక రీజనేంటి?