నారావారిపల్లెలో సంక్రాంతి సందడి.. పిల్లలతో దేవాన్ష్ పోటీ.. మురిసిపోయిన చంద్రబాబు దంపతులు

ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో నారావారిపల్లె సందడిగా మారింది. నారా, నందమూరి కుటుంబ సభ్యులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఇక చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. గ్రామంలోని పిల్లలతో కలిసి ఆటపోటీల్లో పాల్గొన్నాడు. మనవడి ఆటలు చూస్తూ చంద్రబాబు దంపతులు మురిసిపోయారు. చప్పట్లు కొడుతూ పిల్లలను ప్రోత్సహించారు.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10