×
Ad

Swayambhu: స్వయంభు నుంచి స్పెషల్ వీడియో.. విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి.. రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా వస్తున్న పీరియాడిక్ మూవీ స్వయంభు(Swayambhu). కొత్త దర్శకుడు భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నాభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

Rise of Swayambhu video release from Nikhil Swayambhu movie

Swayambhu: యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా వస్తున్న పీరియాడిక్ మూవీ స్వయంభు(Swayambhu). కొత్త దర్శకుడు భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నాభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు పూర్తి అయ్యింది. గుమ్మడికాయ కొట్టేశాడు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఒక స్పెషల్ వీడియోను విడుదల చేశారు. అలాగే వీడియో చివర్లో సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు.

Disha Patani: ఎగిసిపడుతున్న ఎద ఒంపులు.. దిశా పటాని గ్లామర్ ఫోటోలు

మా రెండేళ్ల కష్టం, ఎంతో మంది కష్టం, ఎన్నో సవాళ్లు, అంటూ నిఖిల్ చెప్పిన మాటలతో ఈ వీడియో మొదలయ్యింది. ఆ తరువాత ఒక్కో టెక్నీషియన్ గురించి పరిచయం చేస్తూ వీడియో ముందుకు సాగింది. ఇక ఈ వీడియోకి సంగీత దర్శకుడు రవి బాసృర్ అందించిన మ్యూజిక్ గూస్బంప్స్ తెప్పించేలా ఉంది. అలాగే వీడియోలో విజువల్స్ కూడా నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. భారీ సెట్టింగ్ లు, భారీ గ్రాఫిక్స్ కనిపిస్తున్నాయి. క్వాలిటీ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అని క్లియర్ గా అర్థమవుతోంది. ఇక యుద్ధ వీరుడిగా నిఖిల్ లుక్ కూడా అదిరిపోయింది.

నిఖిల్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 ఫిబ్రవరి 13న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇక ఈ ఒక్క వీడియోతో స్వయంభు సినిమాపై అంచనాలు మాత్రం నెక్స్ట్ లెవల్ కి చేరాయి అని చెప్పాలి. మరి భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తరువాత ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి.