×
Ad

Rishab Shetty: వాటే సక్సెస్ ఫుల్ జర్నీ.. ఆ రోజు సినిమా జస్ట్ ఒకే ఒక్క షో.. ఇప్పుడు ఏకంగా.. రిషబ్ శెట్టి ఎక్కడికో వెళ్లిపోయావ్..

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కాంతార: చాఫ్టర్ 1. బ్లాక్ బస్టర్ కాంతార సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాకు దర్శకత్వం కూడా రిషబ్ శెట్టి(Rishab Shetty)నే వహించడం విశేషం.

Rishab Shetty emotional comments about Kantara: Chapter 1 huge success

Rishab Shetty: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కాంతార: చాఫ్టర్ 1. బ్లాక్ బస్టర్ కాంతార సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాకు దర్శకత్వం కూడా రిషబ్ శెట్టినే వహించడం విశేషం. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆలాగే ఆడియన్స్ నుంచి కూడా ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దాంతో డివోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ క్యూ కడుతున్నారు. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబట్టనుంది ఈ మూవీ. ఈ నేపధ్యంలోనే తాజాగా కాంతార: చాఫ్టర్ 1 సినిమాకు వస్తున్న పాజిటీవ్(Rishab Shetty) రెస్పాన్స్ చూసి ఎమోషనల్ కామెంట్ చేశారు రిషబ్ శెట్టి.

Tom Cruise-Ana de Armas: అంతరిక్షంలో పెళ్లి.. అందరూ ఆహ్వానితులే.. నాలుగో పెళ్లి హడావుడి

ఈ విషయం గురించి ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ..”2016లో నా ప్రయాణం మొదలయ్యింది. ఆ సినిమా సాయంకాలం షో ప్రదర్శించడం కోసం పడిన కష్టం నుంచి ఇవాళ 5000కు పైగా థియేటర్స్‌లో హౌస్‌ఫుల్‌ బోర్డ్స్ కనిపించే వరకూ.. ఇదీ దర్శకుడిగా నా ప్రయాణం. ఆ దేవుడి దయతో పాటు మీ ప్రేమాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేను. కేవలం మీ ఆదరణ వల్లనే ఈ విజయం సాధ్యమైంది. నన్ను ప్రేమించి ఆదరించిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు’’ అంటూ రాసుకొచ్చాడు రిషబ్. ప్రస్తుతం రిషబ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక రిషబ్ శెట్టి విషయానికి వస్తే, 2012లో విడుదలైన ‘తుగ్లక్‌’ సినిమాతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఆ తరువాత 2016లో వచ్చిన ‘రిక్కీ’ సినిమాకు మొదటిసారి దర్శకత్వం వహించారు. 2022లో ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార’ సినిమాకి గాను జాతీయస్థాయిలో అవార్డు సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరోసారి అదే రేంజ్ లో ఆడియన్స్ ను అలరించేందుకు కాంతార: చాఫ్టర్ 1 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రిషబ్. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది.