×
Ad

Rishab Shetty: జీవితాంతం గుర్తుండిపోయే సన్నివేశం.. షూట్ టైంలో కఠిన నియమాలు: రిషబ్ శెట్టి

అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలనం సృష్టించిన సినిమా కాంతార(Rishab Shetty). కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా చేసిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

Rishab Shetty's interesting comments on Kantara Chapter 1

Rishab Shetty: అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలనం సృష్టించిన సినిమా కాంతార. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా చేసిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. డివోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా మేకర్స్ కేవలం రూ.16 కోట్లు ఖర్చు చేశారు. కానీ, లాంగ్ రన్ లో ఈ సినిమా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతార 2: ది లెజెండ్ సినిమా వస్తోంది. భారీ అంచనాల(Rishab Shetty) మధ్య ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషబ్ శెట్టి కాంతార 2 గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Bigg Boss 9 Telugu: బై బై సంజన.. బిగ్ బాస్ 9లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. షాక్ లో కంటెస్టెంట్స్.. ఇది కదా ట్విస్ట్ అంటే!

“కాంతార 2 అనేది చాలా ప్రత్యేకమైన సినిమా. కాంతార క్లైమాక్స్‌ కంటే చాలా శక్తిమంతంగా ఉంటుంది. కాంతార 2 లో కొన్ని సన్నివేశాలను మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. ముఖ్యంగా ఒక సీన్‌ మాత్రం జీవితాంతం గుర్తుంటుంది. ఇకనుంచి నన్ను చూసిన ప్రతీసారి మీకు ఆ సన్నివేశమే గుర్తుకు వస్తుంది. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళ అని భాషతో సంబంధం లేకుండా ప్రతీఒక్కరు ఆ సన్నివేశం గురించి మాట్లాడుకుంటారు. ఇక సినిమాలో దేవుడి సన్నివేశాలు తీసే సమయంలో కఠినమైన నియమాలు పాటించాను. మాంసాహారం, చెప్పులకు దూరంగా ఉన్నాను. నేను దేవుడిని చాలా నమ్ముతాను. అందుకే నాకు నేను కొన్ని పరిమితులు పెట్టుకున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు రిషబ్ శెట్టి. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.