Guppedantha Manasu Serial : తల్లీ, కొడుకులు ప్రేక్షుకుల్ని నాన్‌స్టాప్‌గా ఏడిపించేసారు..రిషి, జగతి నటన మామూలుగా లేదు

ప్రాణాపాయ స్థితిలో ఉన్న జగతి కళ్లు తెరుస్తుంది. వసుధరని పెళ్లి చేసుకోమని రిషిని అడుగుతుంది. జగతిని గన్‌తో కాల్చిన వ్యక్తి దగ్గరకి వెళ్తాడు శైలేంద్ర.. ఆ తరువాత ఏం జరిగింది?

Guppedantha Manasu Serial

Guppedantha Manasu Serial : జగతి రిషి తనని అమ్మా అని పిలవడంతో తీవ్ర భావోద్వేగానికి గురవుతుంది. తను చిన్నతనంలో రిషిని దూరం పెట్టడానికి కారణం చెబుతుంది? వసుధరని పెళ్లిచేసుకోమని రిషిని కోరుతుంది. తరువాత ఏం జరిగింది.

రిషి తనని అమ్మా అని పిలవడంతో ఆనందంలో కన్నీరు పెట్టుకుంటుంది జగతి. రిషితో అలా పిలిపించుకుంటూ సంతోషంగా బతకాలని ఉందని అంటుంది. రిషి జగతికి తల్లిగా ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేకపోయాను అని బాధపడతాడు. జగతి త్యాగాన్ని చులకన చేసానని.. చదువుకున్న మూర్ఖుడిలా ప్రవర్తించానని అంటాడు. జగతి రిషిని చిన్నతనంలో అత్తగారింట్లో ఎందుకు వదిలిపెట్టాల్సి వచ్చిందో కారణం చెబుతుంది. తన పుట్టింటివారి బాధ్యత నెరవేర్చే క్రమంలో నువ్వా? వాళ్లా? అనే ప్రశ్న తలెత్తినపుడు రిషిని వదిలిపెట్టి తన తల్లిదండ్రులతో వెళ్లిపోయానని జగతి రిషికి చెబుతుంది. అలా ఏ తల్లి చేయని ద్రోహం చేసి రిషికి అమ్మ ప్రేమను దూరం చేసాను అని చెబుతుంది.

Jyothi Rai : గుప్పెడంత మనసు జగతి మేడం.. సీరియల్‌లో ఇన్నాళ్లు అమ్మగా.. ఇప్పుడు సిరీస్‌ కోసం ఇంత హాట్ గా..

రిషి జగతి చెప్పిన మాటలకు ఆవేదన చెందుతాడు. తల్లి చేయి పట్టుకుని నీ కోసం ఏదైనా చేయడానికి సిద్ధమే అంటాడు. వసుధరని పెళ్లిచేసుమని అడుగుతుంది జగతి. రిషి కాసేపు మౌనంగా ఉండిపోతాడు. తల్లి కోరిక తీర్చడానికి ఆలోచిస్తున్నావా? అని అడుగుతుంది జగతి. తను వసుధర ఏం చేసినా అది రిషి మంచి కోసం చేసామని చెబుతుంది.  వసుధరను పెళ్లి చేసుకుంటానని తల్లికి మాట ఇస్తాడు రిషి.

మరోవైపు జగతిని తుపాకీతో షూట్ చేసిన వ్యక్తి ఇంటికి వెళ్తాడు శైలేంద్ర. తను చేసిన పనికి డబ్బులు ఇవ్వడానికి శైలేంద్ర వచ్చాడని అతను అనుకుంటాడు. నేను చేసిన పాపానికి భూమిపై ఎటువంటి సాక్ష్యాలు ఉండకూడదు అంటూ శైలేంద్ర అతడిని షూట్ చేస్తాడు. ఆ తరువాత ఏం జరిగిందనేది తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

Jyothi Rai : టాలీవుడ్ డైరెక్టర్‌ని పెళ్లాడబోతున్న ‘గుప్పెడంత మనసు’ జగతి మేడం..

‘గుప్పెడంత మనసు’ సీరియల్ ఈ వారం అంతా జగతి, రిషిలు తమ నటనతో ప్రేక్షకుల కంట నీరు తెప్పించారు. ఎమోషనల్ సీన్స్‌తో  సాగుతున్న ఈ సీరియల్‌లో ముకేష్ గౌడ, రక్ష గౌడ, సాయి కిరణ్, జ్యోతి రాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కాపుగంటి రాజేంద్ర ఈ సీరియల్ డైరెక్ట్ చేస్తున్నారు.