Shekar Basha : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రెండో వారం కూడా పూర్తయింది. మొదటివారం బేబక్క ఎలిమినేట్ అవ్వగా రెండో వారం శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ లో కాస్తో కూస్తో కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది శేఖర్ బాషానే అలాంటిది అతన్ని పంపించడంతో బిగ్ బాస్ ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. అయితే శేఖర్ బాషా కావాలనే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోయాడని వార్తలు వస్తున్నాయి.
శనివారం ఎపిసోడ్ లో శేఖర్ బాషాకు కొడుకు పుట్టాడని నాగార్జున చెప్పడంతో అతను ఎమోషనల్ అయ్యాడు. మూడు రోజుల క్రితమే శేఖర్ బాషాకి కొడుకు పుట్టాడు. ఈ విషయం తెలియడంతో శేఖర్ బాషానే బయటకి వెళ్లిపోవాలని అనుకున్నాడట. తన భార్య, కొడుకుని చూడాలని, ఈ సమయంలో వాళ్ళ దగ్గర ఉండాలని శేఖర్ బాషా అనుకోని తనే స్వయంగా వెళ్లిపోవడానికి ఫిక్స్ అయ్యాడట. దీంతో శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యేట్టు బిగ్ బాస్ ప్లాన్ చేసిందని పలువురు భావిస్తున్నారు.
Also Read : Devara Making Video : ‘దేవర’ మేకింగ్ వీడియో చూశారా..? సముద్రాన్నే సృష్టించారుగా..
ఈ వార్తలపై శేఖర్ బాషా స్పందిస్తూ.. నేనే కావాలని బయటకి వచ్చేసాను. బిగ్ బాస్ చరిత్రలో ఇదే ఫస్ట్ హ్యాపీ ఎలిమినేషన్. నా కొడుకును చూడటానికే నేను అడిగి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసాను. అలాగే నాకు కొంచెం ఫుడ్ కూడా ప్రాబ్లమ్ అయింది. హౌస్ లో అందరూ నాకు సపోర్ట్ చేసారు. నేను ఇంకా ముందుకు వెళ్తాను అని నమ్మి నాకు సపోర్ట్ చేసిన వారందరికీ క్షమాపణలు చెప్తున్నాను అని తెలిపారు.
Also See : Amala Paul : ఫ్యామిలీతో అమలాపాల్ ఓనమ్ సెలబ్రేషన్స్.. మొదటిసారి కొడుకు ఫేస్ రివీల్.. ఫొటోలు వైరల్..
అయితే ఎపిసోడ్ లో మాత్రం.. హౌస్ లో రెండో వారం నామినేషన్స్ లో అందరూ సేవ్ అయి చివరకు శేఖర్ బాషా, ఆదిత్య ఓం మిగలడంతో నాగార్జున ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనేది కంటెస్టెంట్స్ చేతుల్లో పెట్టాడు. దీంతో హౌస్ లో కిరాక్ సీత తప్పితే అందరూ శేఖర్ బాషానే వెళ్లిపోవాలని డిసైడ్ చేసారు. దీంతో హౌస్ లో అందరూ కట్టకట్టుకుని కావాలని శేఖర్ బాషాని పంపించేశారని శేఖర్ బాషా ఫ్యాన్స్ అంటున్నారు.