‘రాబర్ట్’ గా ‘ఛాలెంజింగ్ స్టార్’ దర్శన్ టాలీవుడ్ ఎంట్రీ..

‘రాబర్ట్’ గా ‘ఛాలెంజింగ్ స్టార్’ దర్శన్ టాలీవుడ్ ఎంట్రీ..

Updated On : February 6, 2021 / 2:12 PM IST

Roberrt Movie: ప్రముఖ కన్నడ నటుడు ‘ఛాలెంజింగ్ స్టార్’ దర్శన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో దర్శన్ నటించిన ‘రాబర్ట్’ మూవీ తొలిసారి తెలుగులో విడుదల కానుంది.. సెకండ్ ఇన్నింగ్స్‌లో స్పీడ్ పెంచిన సీనియర్ హీరో జగపతిబాబు కీలకపాత్రలో నటించిన ఈ సినిమాలో ఆశా భట్ కథానాయిక.

తరుణ్ కిషోర్ సుధీర్ దర్శకత్వంలో ఉమాపతి ఫిల్మ్స్ బ్యానర్ మీద ఉమాపతి శ్రీనివాస గౌడ నిర్మిస్తున్న ‘రాబర్ట్’ ఫస్ట్ లుక్ తెలుగు టీజర్ రిలీజ్ చేయగా మంచి స్పందన వస్తోంది. ‘తను, ఓర్పులో శ్రీరాముడు.. మాటిచ్చాడంటే దశరథ రాముడు.. ప్రేమతో వస్తే జానకి రాముడు.. తిరగబడితే’’.. అంటూ ఫీమేల్ వాయిస్ చెప్పగా.. ‘నేను, చతుర్ధశ భువన

భయంకర లంకేశ్వర దశకంఠ రావణా’’.. అంటూ మేల్ వాయిస్ చెప్పడం చూస్తే.. ఇవి హీరో హీరోయిన్ల క్యారెక్టర్లు అని అర్థమవుతోంది. రావణాసురుడి కటౌట్ ముందు దర్శన్ కొత్త లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. దీంతో ఈ సినిమాలో అతను నెగెటివ్ క్యారెక్టర్ కూడా చేస్తున్నాడని ఫిక్స్ అయిపోవచ్చు. అర్జున్ జన్యా బ్యాగ్రౌండ్ స్కోర్, సుధాకర్ ఎస్ రాజ్ విజువల్స్ బాగున్నాయి. త్వరలో ‘రాబర్ట్’ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు దర్శన్.