Romantic fame Ketika Sharma says she want to do biopics
Ketika Sharma : ఒకప్పటి హీరోయిన్స్‌లా ఇప్పటి హీరోయిన్లు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం తమ స్టార్ డమ్ ని నిలుపుకోలేక పోతున్నారు. అదృష్టం కలిసి రాక లేదా కథల ఎంపికల వలన అనేది తెలియడం లేదు. ఈ వరసులోనే ఢిల్లీ భామ కేతిక శర్మ (Ketika Sharma) కూడా ఉంది. పూరీజగన్నాధ్ నిర్మాణంలో ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన ‘రొమాంటిక్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయినా, కేతికకి యూత్ లో మంచి కేజ్ ని తెచ్చి పెట్టింది. ఈ మూవీ తరువాత నాగశౌర్య – లక్ష్య, వైష్ణవ తేజ్ – రంగ రంగ వైభవంగా సినిమాల్లో నటించింది.
Ketika Sharma : బ్యూటీ పార్లర్‌లో కేతిక శర్మ గ్లామర్ షో..
ఈ చిత్రాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. ప్రస్తుతం ఈ భామ ఏ సినిమాలో నటించడం లేదు. కాగా ఈ భామ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సినిమా జయాపజయాల, తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి వెల్లడించింది. ‘ఒక సినిమా ఓకే చేసిన తరువాత అది హిట్ అవుతుందా? లేదా? అనేది నేను ఆలోచించాను. ఒక నటిగా నేను ఆ మూవీకి ఏమి చేయగలను అనే నా పని మాత్రమే చూస్తాను. అయితే ఆ సినిమా రిజల్ట్ అనేది మన చేతిలో ఉండదు. ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నాను. మంచి కథ దొరికితే త్వరలో ఒక సినిమాతో వస్తాను’ అంటూ తెలియజేసింది.
ఇక తాను రొమాంటిక్ వంటి యూత్‌ఫుల్ మూవీతో ఎంట్రీ ఇచ్చినా తనకి మాత్రం సకుటుంబంగా చూసే సినిమాల్లో నటించడమే తనకి ఇస్తామంటూ చెప్పుకొచ్చింది. అలాగే బయోపిక్స్ లో నటించాలి అన్నది తన డ్రీమ్ అని, అలాంటి కథ ఏదైనా వస్తే బాగుండని.. తన కోరికను తెలియజేసింది. ఇటీవల వెబ్ సిరీస్ ఆఫర్స్ కూడా వస్తున్నట్లు తెలియజేసిన కేతిక.. స్క్రిప్ట్ నచ్చితే వెబ్ సిరీస్‌ల్లో కూడా నటిస్తాను అంటూ చెప్పుకొచ్చింది.