Rose Villa: రోజ్ విల్లా పేరుతోపాటు పోస్టర్‌ను చూడగానే ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అని అర్థమవుతుంది. కన్నడ ‘దియా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి, ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 5 లో పార్టిసిపెట్ చేస్తున్న శ్వేత వర్మ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా.. ‘రోజ్ విల్లా’.. అర్చనా కుమార్, రాజా రవీంద్ర, ‘వెన్నెల’ రామారావు, స్వర్గీయ టీఎన్ఆర్ కూడా ఇందులో నటించారు. హేమంత్ దర్శకత్వంలో.. చిత్ర మందిర్ స్టూడియోస్ బ్యానర్‌పైఅచ్యుత్ రామారావు పి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, కన్నడలో విడుదలైన ‘రోజ్ విల్లా’ సినిమా ఎలా ఉందో చూద్దాం.
Republic Review : ‘రిపబ్లిక్’ మూవీ రివ్యూ
కథ..
డాక్టర్ రవి (దీక్షిత్ శెట్టి), శ్వేత (శ్వేత వర్మ) అనే ఓ యంగ్ కపుల్ మున్నార్ అనే అందమైన ప్రాంతానికి కారులో షికారుకి వస్తారు. బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉండే ఆ దారిలో ప్రయాణిస్తూ అనుకోకుండా నక్సల్స్ ఉంటున్న డేంజర్ పాయింట్‌కు వెళ్తారు. కరెక్టుగా అప్పుడే వాళ్ల కారు బ్రేక్ డౌన్ అవుతుంది. ఇంతలో అటుగా వచ్చిన పోలీసులు వారిని సేఫ్‌గా ఊరిలో దిగబెడతారు. అక్కడ రెస్టారెంట్‌లో వీరు తింటుండగా రిటైర్ మిలటరీ అధికారి అయిన సోల్‌మాన్ (రాజా రవీంద్ర) తన భార్య హెలెన్‌తో (అర్చనా కుమార్) కూడా అక్కడే ఉంటారు. సోల్‌మాన్ తింటుండగా పొలమారుతుంటే డాక్టర్ రవి చిన్న చిట్కా చెప్పి సేవ్ చేస్తాడు. అలా తనను కాపాడినందుకు గానూ.. రేపు తమ యానివర్శరీ జరపుకోబోతున్నామని.. ఇద్దరూ వచ్చి డిన్నర్ చెయ్యాలని ఫోర్స్ చెయ్యడంతో తప్పక వెళ్తారు. అక్కడి వాతావరణం ఈ యువ జంటకు వితంగానూ, భయం కరకంగానూ అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపించింది? అప్పుడు ఈ యంగ్ కపుల్ ఏం చేశారు? అసలు ‘రోజ్ విల్లా’ లో ఏం జరిగింది?అనేది మిగతా కథ..
3 ROSES : బార్‌లో ఉన్న ముగ్గురు హీరోయిన్స్ ఎవరబ్బా..?
నటీనటులు..
దీక్షిత్, శ్వేత వర్మ భార్యభర్తలుగా నేచురల్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఇక సీనియర్ నటులైన రాజా రవీంద్ర, అర్చనా కుమార్ కూడా తమ నటనతో వారి పాత్రలకు న్యాయం చేశారు.. మిగతా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన నటులు కూడా అలరించారు..
డైరెక్టర్..
దర్శకుడు హేమంత్ ఒక నార్మల్ పాయింట్‌తో అల్లుకున్న స్టోరీకి ఎమోషన్‌ను యాడ్ చేసి.. ప్రేక్షకులను థ్రిల్ చెయ్యడానికి ప్రయత్నించాడు. ‘రోజ్ విల్లా’ కథనం ఆసక్తికరంగా మొదలవుతుంది.. డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. అర్చన, రాజా రవీంద్రల ప్రవర్తన అనుమానం కలిగించేలా ఉండడంతో సినిమా మీద ఆసక్తి పెరుగుతుంది, తర్వాత జరిగే సంఘటనలన్నీ ఈ యువ జంటకు భయం గానూ, ఆశ్చర్యంగానూ అనిపిస్తాయి. దీక్షిత్‌ను చూసి తన కొడుకు అనుకుని ఇక్కడే ఉండమని బలవంతం చేయడం.. అతను ఉండనడడం.. ఆ తర్వాత జరిగే సంఘటనలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవడంతో పాటు.. ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్ కలిగించాయి.. తర్వాత చోటు చేసుకునే మలుపులు సినిమాను ఇంకో లెవల్‌కి తీసుకెళ్లాయి.
MAA Elections 2021 : ‘మా’ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బండ్ల గణేష్..
టెక్నీషియన్స్..
సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఇంట్రడక్షన్ సాంగ్, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. అంజి సినిమాటోగ్రఫీ.. సినిమాకు అందాన్ని తీసుకొచ్చింది. నేచురల్ లొకేషన్స్‌లో షూట్ చెయ్యడంతో షాట్స్ అన్నీ బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. శివ ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది కానీ ఇంకొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండేదనిపిస్తుంది.
Tollywood Movies : డిజిటల్ రైట్స్ కోసం కోట్లు ఖర్చు..!
ఓవరాల్‌గా..
లిమిటెడ్ బడ్జెట్ అండ్ ఆర్టిస్టులతో తెరకెక్కించి ‘రోజ్ విల్లా’ లో కొడుకు కోసం తపించే తల్లిదండ్రుల వేదన, బాధ ఇందులో స్పష్టంగా చూపించాడు. ఎక్కడా విసుగు తెప్పించకుండా సస్పెన్స్‌ను చివరలో చెప్పి మరింత ఆకట్టుకున్నాడు డైరెక్టర్. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూసే వారికి ఈ సినిమా నచ్చుతుంది. దర్శకుడు ప్రేక్షకులను మరీ అనుకున్నంత స్థాయిలో భయపెట్టక పోయినా మానవ నైజంలోని మరో కోణాన్ని ఇందులో చూపించాడు. ఇలాంటి తల్లిదండ్రులు సమాజంలో చాలామందే ఉన్నారనే చెప్పే ప్రయత్నం చేశాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను ఎండ్ చేసిన విధానం మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది..
Love Story Magical Success Meet : కింగ్‌కి సాయి పల్లవి సర్‌ప్రైజింగ్ హగ్..