Ajay Patnaik : మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్న ఆర్పీ పట్నాయక్‌ కజిన్ అజయ్ పట్నాయక్.. ఒక్క సినిమాతో నాలుగు సినిమా ఛాన్సులు..

ఆర్పీ పట్నాయక్‌ కజిన్ అజయ్ పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్నారు.

RP Patnaik Cousin Ajay Patnaik as Music Director coming with Noel Sean Bahirbhoomi Movie

Ajay Patnaik : సినీ పరిశ్రమలో ఆర్పీ పట్నాయక్‌ సంగీత దర్శకుడిగా, నటుడిగా, డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అతని కజిన్ అజయ్ పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్నారు. అజయ్ పట్నాయక్ సంగీతం అందించిన ‘బహిర్భుమి’ సినిమా అక్టోబర్ 4న విడుదల కానుంది. నోయల్, రిషిత జంటగా మహకాళి ప్రొడక్షన్ బ్యానర్ పై మచ్చ వేణుమాధవ్ నిర్మాణంలో రాంప్రసాద్ కొండూరు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి అజయ్ పట్నాయక్ సంగీత దర్శకత్వంలో వచ్చిన సాంగ్స్ మెప్పించాయి.

తాజాగా అజయ్ పట్నాయక్ మీడియాతో ముచ్చటిస్తూ తన గురించి, తన సంగీత ప్రయాణం గురించి, బహిర్భుమి సినిమా గురించి మాట్లాడారు. అజయ్ పట్నాయక్ తన గురించి చెప్తూ.. విజయనగరంలో పుట్టాను. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్‌ అన్నయ్య అవుతారు. చిన్నప్పట్నుంచి నాకు సంగీతం ఇష్టం. ఏఆర్‌ రెహమాన్‌ రోజా సినిమా మ్యూజిక్ కి బాగా అట్రాక్ట్ అయి కీబోర్డు స్టార్ట్‌ చేశాను. అయితే బయటి మ్యూజిక్ కి, సినిమా సంగీతానికి తేడా ఉంది. దీంతో హైదరాబాద్‌కి వచ్చి మ్యూజిక్‌ నేర్చుకున్నాను. ఆ తర్వాత కొన్ని ప్రైవేట్ సాంగ్స్, కీబోర్డు ప్లేయర్ గా, అసిస్టెంట్ కంపోజర్ గా పనిచేసాను కొంతమంది దగ్గర. 2008లోనే మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ప్రయాణం మొదలుపెట్టాను అని తెలిపారు.

Also See : Konidala Anjanamma : చిరంజీవి మాతృమూర్తి అంజనా దేవి స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూ

అలాగే.. నేను కంపోజ్ చేసిన కొన్ని గత సినిమాలు అంతగా ఆడలేదు దాంతో నా సంగీతానికి పేరు రాలేదు. అన్నయ్య ఆర్పీ పట్నాయక్ ఎఫెక్ట్ నాపై చాలా ఉంది. దీంతో నేను కంపోజ్ చేసిన ఓ పాట అన్నయ్యదే అనుకున్నారు. అప్పట్నుంచి నా స్టైల్ లో కొత్తగా ట్రై చేస్తున్నాను. ఇప్పటివరకు దాదాపు 12 సినిమాలకు సంగీతం అందించాను. ఇప్పుడు బహిర్భూమి సినిమాతో గుర్తింపు వస్తుంది అని తెలిపారు.

బహిర్భూమి సినిమా గురించి మాట్లాడుతూ.. నోయల్‌ నాకు మంచి ఫ్రెండ్. మ్యూజిక్ లో నోయల్ నా కంటే సీనియర్. అతని ద్వారానే నాకు ఈ సినిమా ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాలో నోయల్ ర్యాంప్‌ సాంగ్‌ పాడాడు. ఈ సినిమాకు చాలా మంచి బీజీఎం ఇచ్చాను. ‘మంగళవారం’ సినిమా రేంజ్ లో ఉంటుంది. కథతో పాటు నటీనటుల ప్రభావం కూడా సంగీతంపై ఉంటుంది. నోయల్‌ ఉన్నాడు కాబట్టే బహిర్భుమి సినిమాకు మంచి బీజీఎం ఇచ్చాను. డైరెక్టర్ కి ఇది మొదటి సినిమా అయినా నా నుంచి మంచి మ్యూజిక్ రాబట్టాడు. నిర్మాత గారు కూడా చాలా సపోర్ట్ చేసారు అని తెలిపాడు.

బహిర్భుమి సినిమాతో తనకు వచ్చిన అవకాశాల గురించి చెప్తూ.. బహిర్భూమి ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌ అయ్యాక ఓ నిర్మాత నా స్టూడియోకు వచ్చి ఈ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్‌ కంటే మూడింతలు ఎక్కువ ఇచ్చి తాను తీయబోయే సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమా సాంగ్స్ కి వ్యూస్‌ తక్కువే వచ్చినా మంచి రీచ్ వచ్చింది. నా గత 12 సినిమాలు వేరు, ఈ బహిర్భుమి సినిమా వేరు. ఈ సినిమా పాటలు విని చాలా మంది ఫోన్‌ చేసి అభినందించారు. ఈ సినిమాతో నాకు నాలుగు సినిమాల ఆఫర్లు వచ్చాయి. అవి కాకుండా ఇంకో మూడు సినిమాలు రాబోతున్నాయి నా సంగీత దర్శకతవమలో అని తెలిపారు అజయ్ పట్నాయక్.

ఇక ఎప్పటికైనా పూరీ జగన్నాథ్‌ సినిమాకు సంగీతం అందించాలని కోరుకుంటున్నారు అజయ్ పట్నాయక్. మరి ఫ్యూచర్ లో వాళ్ళ అన్నయ్య ఆర్పీ పట్నాయక్ రేంజ్ లో తన పాటలు, సంగీతంతో మెప్పిస్తారేమో చూడాలి.