Rrr Movie Locks Release Date For Japan Release
RRR: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ది మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం యావత్ దేశ ప్రజలు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారో మనం చూశాం. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా అత్యంత భారీ బడ్జెత్‌తో రూపొందించిన రాజమౌళి, భారీ అంచనాల మధ్య ఈ సినిమాను మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు కలిసి నటించడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు.
RRR : ఇలాంటి ఎంట్రీ ఎప్పుడూ చూడలేదు.. ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న ఎన్టీఆర్ వీడియో
ఫలితంగా ఆర్ఆర్ఆర్ ఓ ప్రభంజనంగా మారింది. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాలో రామరాజు పాత్రలో చరణ్, భీమ్ పాత్రలో తారక్‌ల టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్.. జక్కన్న మార్క్ టేకింగ్ అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి మరోసారి గ్లోబల్ సినిమాకు తెలుగు సినిమా సత్తాను రుచిచూపించింది. అయితే ఇప్పుడు మరోసారి తన సత్తా చాటేందుకు ఆర్ఆర్ఆర్ రెడీ అవుతోంది.
RRR: HCAలో దుమ్ములేపిన ఆర్ఆర్ఆర్.. రెండో ప్లేస్ కైవసం!
జపాన్‌లో జక్కన్న సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో మనం ‘బాహుబలి’తో చూశాం. దీంతో ఇప్పుడు జపాన్‌లో ఆర్ఆర్ఆర్ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే జపాన్‌లో ట్రిపుల్ఆర్ చిత్ర రిలీజ్‌పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాను జపాన్‌లో 2022 అక్టోబర్ 21న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో మరోసారి సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటికీ ఆర్ఆర్ఆర్ సినిమాపై గ్లోబల్ సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తుండగా, తాజాగా ఇప్పుడు జపాన్‌లో రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయడంతో, అక్కడ ఈ సినిమా ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందా అని ఆర్ఆర్ఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Delighted to announce that #RRRMovie is releasing in Japan on 21st Oct, 2022. #RRRinJapan pic.twitter.com/YS4eNGYxE5
— RRR Movie (@RRRMovie) July 21, 2022