Hollywood Actors Rally
Hollywood Actors Rally : కొత్త కార్మిక ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో యూనియన్ విఫలమవడంతో హాలీవుడ్ నటీనటులు, రచయితలు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీంతో అనేక టీవీ షోలు సినిమాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో వారు చేస్తున్న సమ్మెలో RRR పోస్టర్ కనిపించడం వైరల్ అవుతోంది.
Priyanka Chopra : హాలీవుడ్ యాక్టర్స్ సమ్మెకు మద్దతుగా ప్రియాంక చోప్రా..
ఎక్కువ పని చేయించుకోవడం, తక్కువ వేతనాలు ఇవ్వడం వంటి అనేక కారణాలతో స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్- అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ మరియు రేడియో ఆర్టిస్ట్స్ (SAG-AFTRA) మొదలుపెట్టిన సమ్మె కొనసాగుతోంది. ఈ యూనియన్‌లో 160,000 మంది నటులు, మీడియాలో పనిచేసేవారు, జర్నలిస్టులు, హోస్ట్‌లు ఉన్నారు. డిస్నీ, వార్నర్ బ్రదర్స్, నెట్‌ఫ్లిక్స్ వంటి స్టూడియోలతో పాటు స్ట్రీమింగ్ సేవలను కలిగి ఉన్న అలయన్స్ ఆఫ్ మోషన్ పిక్చర్, టెలివిజన్ ప్రొడ్యూసర్స్ (AMPTP)తో SAG-AFTRA ప్రతి మూడు సంవత్సరాల గ్యాప్‌లో బేరం కుదుర్చుకుంటుంది. అయితే తాజాగా కుదుర్చుకున్న ఒప్పందంలో యూనియన్ విఫలమవడంతో స్క్రీన్ యాక్టర్స్, గిల్డ్ చేస్తున్న సమ్మె కారణంగా అనేక టీవీ షోలు, సినిమాలు నిలిచిపోయాయి.
ఇదిలా ఉంటే వీరు చేస్తున్న సమ్మెలో SS రాజమౌళి సినిమా RRR పోస్టర్ కనిపించడం వార్తల్లోకెక్కింది. నాటు నాటు నుండి రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ తమ హుక్ స్టెప్ చేస్తున్న పోస్టర్‌ను ఓ టోపీ పెట్టుకున్న వ్యక్తి పట్టుకుని సమ్మెలో నడుస్తూ వెళ్లడం వైరల్ గా మారింది. ఈ పోస్టుపై మిశ్రమంగా నెటిజన్లు స్పందించారు. RRR అనేది ఒక ఎమోషన్ అని, ఈ టైమ్‌లో ఆ పోస్టర్ ఎందుకు? సెన్స్ లేదని.. కామెంట్లు చేశారు. ఏది ఏమైనా ఆస్కార్ గెలుచుకున్న RRR నాటు నాటు పాటకి సంబంధించిన పోస్టర్ ఇప్పుడు హాలీవుడ్ నటీనటుల సమ్మెలో కనిపించడం కూడా పెద్ద వార్తే కదా.
RRR poster spotted during Actors strike Rally in Hollywood. ?#StRRRike#SAGAFTRAstrike pic.twitter.com/pKzMpVnWN6
— Rick Sulgie (@Aloydinkan) July 15, 2023