RRR team off to Oscar and ram Charan got a rare honor
RRR : రాజమౌళి తెరకెక్కించిన RRR.. తెలుగు సినిమాకే కాదు ఇండియన్ సినిమాకు కూడా ఎంతో కీర్తిని తెచ్చి పెట్టింది. అంతేకాదు ఈ చిత్రం కోసం పని చేసిన సాంకేతిక నిపుణలకు, నటులకు కూడా ఎంతో పాపులారిటీని సంపాదించి పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలో యాక్ట్ చేసిన ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ కి పాన్ ఇండియా వైడ్ మాత్రమే కాదు వరల్డ్ వైడ్ అభిమానులను సంపాదించి పెట్టింది. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు కూడా వీరిద్దరి నటనకి ఫిదా అయ్యిపోతున్నారు.
RRR : దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్.. ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా RRR
ఏ ఇండియన్ యాక్టర్స్ కి వరించిన ఎన్నో గౌరవాలు వీరిద్దరికి దక్కుతున్నాయి. తాజాగా రామ్ చరణ్ కి అలాంటి అరుదైన గౌరవం దక్కింది. హాలీవుడ్ లో నిర్వహించే HCA (హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్) అవార్డ్స్ లో ఆర్ఆర్ఆర్ బెస్ట్ మూవీ, డైరెక్టర్, ఇంటర్నేషనల్ మూవీ, యాక్షన్ ఫిలిం విభాగాల్లో పోటీ చేస్తుంది. ఈ నెల 24న బెవర్లీ హిల్స్ లో ఈ అవార్డుల వేడుక జరగబోతుంది. కాగా ఈ అవార్డుల పురస్కారానికి రామ్ చరణ్ ని HCA ప్రజెంటర్ గా ఆహ్వానించింది. విజేతగా నిలిచిన వారు రామ్ చరణ్ చేతులు మీదగా అవార్డు అందుకోనున్నారు. ఈ ఘనత అందుకున్న తొలి హీరోగా చరణ్ రికార్డ్ క్రియేట్ చేశాడు.
ఇక ఈ అవార్డులతో పాటు ఆస్కార్ వేడుకల్లో కూడా పాల్గొడానికి రామ్ చరణ్ అండ్ RRR టీం అమెరికా బయలుదేరారు. ఫిబ్రవరి 20 రాత్రి రామ్ చరణ్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరాడు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మార్చి 13న ఆస్కార్ అవార్డులు వేడుక జరుగనుంది. కాగా నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలుచుకోవడంలో సందేహం లేదు అంటున్నాయి హాలీవుడ్ మీడియా. ఇప్పటికే ఈ పాట పలు అంతర్జాతీయ అవార్డులు అందుకోవడమే కాకుండా, ఆస్కార్ తరువాత ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డుని కూడా అందుకొని చరిత్ర సృష్టించింది.
Oscars 2023: Ram Charan heads to the US, spotted walking barefoot at airport #RamCharan #Oscars #Oscars2023 #NaatuNaatu #RRR #AcademyAwards #metrotimes pic.twitter.com/Rv3kO7upvJ
— Metro Times (@CamLivetv) February 21, 2023