RRR Glimpse : ‘ఆర్ఆర్ఆర్’ గ్లింప్స్ డేట్, టైం ఫిక్స్
ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి రాబోయే టీజర్ తో రాజమౌళి ఈ సినిమాపై ఇంకెన్ని అంచనాలు పెంచుతాడో చూడాలి. అభిమానులు, ప్రేక్షకులు ఈ టీజర్ కోసం ఆసక్తిగా
- Saketh U
- Published On : October 30, 2021 / 01:28 PM IST
Rrr
RRR Teaser : ‘బాహుబలి’ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని తెరకెక్కించారు. స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో భారీ మల్టీస్టారర్ ని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది ‘ఆర్ఆర్ఆర్’. ఇటీవల 2022 జనవరి 7న ఈ సినిమా రిలీజ్ చేస్తారని ప్రకటించారు.
Puneeth Rajkumar : పునీత్ మృతితో రెండు రోజులు వైన్ షాప్స్ బంద్
కొన్ని రోజుల నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టేసారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ చూస్తుంటే ఈ జనవరిలో కచ్చితంగా సినిమా రిలీజ్ అవుతుంది అనిపిస్తుంది. ఇప్పటికే PVR cinemas తో ప్రమోషన్ డీల్ కుదుర్చుకొని సినిమా రిలీజ్ అయ్యేవరకు పివిఆర్ కి సంబంధించిన అన్ని మల్టీప్లెక్స్ ల పేరు PVRRR గా మారుస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రమోషన్స్ కోసం ఒక ఇంస్టాగ్రామ్ పేజీకి కూడా ‘ఆర్ఆర్ఆర్’ జోడించారు. ఇక గ్లింప్స్ రిలీజ్ కి చిత్ర బృందం రెడీ అయింది. ఇవాళ గ్లింప్స్ ని రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణంతో గ్లింప్స్ రిలీజ్ ని ఎల్లుండికి వాయిదా వేశారు.
Sharukh Khan : కొడుక్కి బెయిల్.. లీగల్ టీంకి పార్టీ ఇచ్చిన షారుఖ్
‘ఆర్ఆర్ఆర్’ నుంచి 45 సెకన్ల గ్లింప్స్ రూపంలో నవంబర్ 1న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి రాబోయే గ్లింప్స్ తో రాజమౌళి ఈ సినిమాపై ఇంకెన్ని అంచనాలు పెంచుతాడో చూడాలి. అభిమానులు, ప్రేక్షకులు ఈ గ్లింప్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Releasing a 45 second glimpse of #RRRMovie on Nov 1st at 11 AM.
??#RRRGlimpse ??⚡️@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @mmkeeravaani @ajaydevgn @aliaa08 @oliviamorris891 @DVVMovies @PenMovies @jayantilalgada pic.twitter.com/RS99Alr51e— RRR Movie (@RRRMovie) October 30, 2021
