Bigg Boss 5 : షన్నుకి ముద్దు పెట్టిన సిరి.. సిరి బాయ్ ఫ్రెండ్ ఏమన్నాడో తెలుసా?
షన్నునే సిరితో అరె ఇక నేను మాట్లాడను రా అదే బెస్ట్ అనడంతో సిరి వచ్చి షణ్ముఖ్‌కు నుదుటిపై ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. దీంతో షన్ను ఆశ్చర్యంగా కెమెరా వైపు చూస్తూ ‘అరె ఎంట్రా ఇది’

Siri Srihan
Bigg Boss 5 : బిగ్ బాస్ లో గొడవలతో పాటు అప్పుడప్పుడు ఎమోషనల్స్, సెంటిమెంట్స్, లవ్ ట్రాక్స్, ఫ్రెండ్షిప్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ సీజన్ లో లవ్ ట్రాక్స్ తక్కువే ఉన్నాయి. ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇక సభ్యులంతా ఫ్రెండ్స్ అంటూ గ్రూపులుగా విడిపోయారు. ఈ సారి ఫ్రెండ్స్ అంటూనే హాగ్ చేసుకుంటున్నారు, ముద్దులు పెట్టుకుంటున్నారు.
Sharukh Khan : కొడుక్కి బెయిల్.. లీగల్ టీంకి పార్టీ ఇచ్చిన షారుఖ్
ఈ సీజన్ బిగ్ బాస్ లో మొదటి నుంచి షన్ను, సిరి కలిసి గేమ్ ఆడుతున్నారు. అప్పుడప్పుడు ఇద్దరూ గొడవ పడినా మళ్ళీ వెంటనే కలిసిపోతున్నారు. వీళ్లిద్దరు బిగ్ బాస్ కి రాకముందు నుంచి కూడా మంచి ఫ్రెండ్స్ అవడంతో హౌస్ లో చాలా క్లోజ్ గా ఉంటున్నారు. తాజాగా సిరి, షణ్ముఖ్‌కు ముద్దు పెట్టడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొన్నటి ఎపిసోడ్ లో షన్ను సిరిని ఉద్దేశించి.. మానసికంగా డిస్ట్రబ్ అయినప్పుడు ఎమోషనల్‌గా అటాచ్ అయిపోతాం అని అన్నాడు. దీంతో సిరి నేను బాగానే ఉన్నారా. నీ వల్లే మెంటల్‌గా ఎక్కువ ఇబ్బంది పడుతున్నా అని చెప్పడంతో అయితే నన్ను దూరం పెట్టు అని షన్ను కొంచెం సీరియస్ గానే అన్నాడు. దీంతో సిరి కాసేపు సైలెంట్ అయిపొయింది. ఆ తర్వాత షన్నునే సిరితో అరె ఇక నేను మాట్లాడను రా అదే బెస్ట్ అనడంతో సిరి వచ్చి షణ్ముఖ్‌కు నుదుటిపై ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. దీంతో షన్ను ఆశ్చర్యంగా కెమెరా వైపు చూస్తూ ‘అరె ఎంట్రా ఇది’ అంటూ ఎప్పటిలాగే తన డైలాగ్‌ను వాడాడు. అలాగే కెమెరా వైపు చూసి అంతా రికార్డు చేశారా? ఇక నాకు ఉంటుంది, నా పని అయిపొయింది అంటూ ఫన్నీగా అన్నాడు. సిరి ముద్దు పెట్టి వెళ్లిపోయే సీన్ కి బిగ్ బాస్ సాంగ్ యాడ్ చేసి కొంచెం రొమాంటిక్ గా టెలికాస్ట్ చేశాడు.
Aryan Khan : ముంబైలో ఆర్యన్ కి బెయిల్.. కర్నూల్ లో సంబరాలు.. విమర్శిస్తున్న నెటిజన్లు
అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా సిరి బాయ్ ఫ్రెండ్ ని కూడా ఆ వీడియోకి ట్యాగ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. సిరి త్వరలో పెళ్లి చేసుకోబోతుందని అందరికి తెలుసు. శ్రీహన్ అనే ఆర్టిస్ట్ ని సిరి ఎప్పట్నుంచో ప్రేమిస్తుంది. వీళ్ళిద్దరూ అఫిషియల్ గానే సోషల్ మీడియాలో అన్ని షేర్ చేస్తారు. ఇక సిరి షన్నుకి ముద్దు పెట్టడంతో సిరి బాయ్ ఫ్రెండ్ ని ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. వీటికి శ్రీహన్ గట్టిగానే సమాధానం ఇచ్చాడు. నిన్న అతని ఇంస్టాగ్రామ్ లో దీనిపై స్పందిస్తూ.. ఇప్పుడు అది చూసి నేను ఏడవాలా ఏంటి? ఇదే పని షార్ట్ ఫిలిమ్స్ లోనో, సినిమాలోనో చేస్తే మీకు ఓకే కదా అని నెగిటివ్ కామెంట్స్ చేసే వారిని ఉద్దేశించి పోస్ట్ చేశాడు. దీంతో మరోసారి వారిద్దరి మధ్య ఉన్న నిజమైన ప్రేమ బయటపెట్టాడు.