Rukshar Dhillon : ‘రుక్సర్ థిల్లాన్’ ఫొటో ఇష్యూ ఇంకా అవ్వలేదా.. ఈవెంట్లో ఫొటోలు దిగలేదా? తియ్యలేదా? మధ్యలోనే వెళ్ళిపోయిన హీరోయిన్..
ఇటీవల హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

Rukshar Dhillon Photographers Issue Continue in Dulruba Event Actress Left from Group Photos
Rukshar Dhillon : ఇటీవల హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్ జంటగా తెరకెక్కుతున్న ‘దిల్ రూబా’ సినిమా మార్చ్ 14న రానుంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో స్టేజిపై రుక్సర్ థిల్లాన్ మాట్లాడుతూ.. నేను సౌకర్యంగా లేను అని చెప్పినా కొంతమంది ఫోటోలు తీస్తున్నారు. వద్దని చెప్పినా ఫొటోలు తీయడం రైటా? తప్పా? ఫోటోలు తీయొద్దు అని ప్రేమగా చెప్పినా వినిపించుకోలేదు. వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు అని గట్టిగానే మాట్లాడింది. దీంతో రుక్సర్ థిల్లాన్ వ్యాఖ్యలు వైరల్ అయి మీడియాలో, సినీ పరిశ్రమలో కూడా చర్చగా మారాయి.
అయితే సాధారణంగా సినిమా ఈవెంట్స్ లో హీరో, హీరోయిన్స్ ని ఫోటోలు తీస్తారు. అందుకు అన్ని మీడియాల నుంచి ఫోటోగ్రాఫర్స్ వస్తారు. ప్రతి ఈవెంట్లో ఇది జరుగుతుంది. ఆ రోజు దిల్ రుబా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా రుక్సర్ థిల్లాన్ ని ఫొటోలు తీయబోతే ఈ డ్రెస్ కంఫర్ట్ గా లేదు, ఇందులో ఫోటోలు వద్దు అని ఫోటోగ్రాఫర్స్ కి గట్టిగానే చెప్పిందట. దీంతో ఫోటోగ్రాఫర్స్ స్టేజిపై గ్రూప్ ఫొటోల్లో కూడా ఆమెని పక్కకి తప్పించి ఫోటోలు తీశారు అని సమాచారం. దీనికి రుక్సర్ థిల్లాన్ అలిగి అలా సీరియస్ గా మాట్లాడిందని పలువురు అంటున్నారు. ఆ తర్వాత దీని గురించి తన సోషల్ మీడియాలో ఈ ఘటనపై పోస్ట్ కూడా పెట్టింది రుక్సర్.
Also Read : Lovely Teaser : ‘లవ్లీ’ టీజర్ చూశారా? ఇదేదో రాజమౌళి ఈగ సినిమాలా ఉందే.. ఈగ అమ్మాయిగా మాట్లాడితే..
అయితే ఈ గొడవ ఇంకా ముగియలేదు అని తెలుస్తుంది. నిన్న దిల్ రూబా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో కూడా ఫొటోగ్రాఫర్లు రుక్సర్ థిల్లాన్ ఫొటోలు తీయలేదు. గ్రూప్ ఫొటోల్లో కూడా రుక్సర్ ఉంటే తీయము అని చెప్పారంట. తప్పక మూవీ యూనిట్ రుక్సర్ ని పక్కకి పంపి గ్రూప్ ఫొటోస్ దిగారు. మూవీ యూనిట్ గ్రూప్ ఫొటోలు దిగేటప్పుడు రుక్సార్ మధ్యలోనుంచి వెళ్లిపోయిన వీడియోలు వైరల్ గా మారాయి.
దీంతో ఈ గొడవ ఇంకా ముగియలేదు అని తెలుస్తుంది. మరి రుక్సర్ తర్వాత సినిమాలకు కూడా ఫోటోగ్రాఫర్స్ ఫొటోలు తీయరా? గ్రూప్ ఫొటోల్లో కూడా తీయకపోతే మూవీ యూనిట్స్ కే నష్టం కదా అని సందేహం వ్యక్తపరుస్తున్నారు. ఇలాగే ఉంటే రుక్సార్ తర్వాతి సినిమా ప్రమోషన్స్ కి కష్టమే అని అంటున్నారు. మరి రుక్సార్ థిల్లాన్ – ఫొటోగ్రాఫర్లు గొడవ ఎప్పుడు ముగుస్తుందో చూడాలి.