Sacred Games Actor Elnaaz Norouzi
Sacred Games Actor Elnaaz Norouzi: ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లెక్స్ లో ప్రసారమయిన “స్కేర్డ్ గేమ్స్” ఎంతటి ప్రజాదారణ పొందిందో మనందరికీ తెలిసిందే. ఈ సిరీస్ లో నటించిన ఇరాన్ హీరోయిన్ “ఎల్నాజ్ నోరౌజీ” సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఆమె ఒంటి మీద బట్టలన్నీ విప్పేస్తూ దర్శనమిచ్చింది.
Ram Charan: RC15 నుంచి లీకైన ఫోటోలు.. అంచనాలను పెంచేస్తున్న రాంచరణ్, శంకర్ సినిమా!
ప్రస్తుతం ఇరాన్ లో హిజాబ్ వివాదం నడుస్తుంది. ఈ ఆందోళనలు తార స్థాయికి చేరుకోవడంతో, ఎల్నాజ్ కూడా తన వంతు నిరసన తెలుపుతూ, ఈ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో.. “ప్రతి స్త్రీ ప్రపంచంలో ఎక్కడైనా, ఎక్కడి నుండి వచ్చినా ఆమె కోరుకున్నది ధరించే హక్కు తనకు ఉంది. ఈ విషయాన్ని కాదనే అధికారం.. ఏ పురుషుడు లేదా మరే ఇతర స్త్రీ లేదు.
ప్రతి ఒక్కరికి భిన్నమైన అభిప్రాయాలు మరియు నమ్మకాలు ఉంటాయి. మనం వాటిని గౌరవించాలి. ప్రజాస్వామ్యం అంటే స్వేచ్చా నిర్ణయం తీసుకునే హక్కు. అలాంటిది ప్రతి స్త్రీకి తన వేషధారణపై స్వయంగా నిర్ణయం తీసుకునే అధికారం లేకపోతె ఎలా. నేను ఈ వీడియో ద్వారా నగ్నత్వాన్ని ప్రచారం చేయడం లేదు, ఎంపిక చేసుకునే స్వేచ్ఛను ప్రచారం చేస్తున్నాను” అంటూ వ్యాఖ్యానించింది.