Ram Charan: RC15 నుంచి లీకైన ఫోటోలు.. అంచనాలను పెంచేస్తున్న రాంచరణ్, శంకర్ సినిమా!

రాంచరణ్ హీరోగా, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కలయికలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా RC15. తెలుగులోనే కాదు, హిందీ, తమిళంతో పాటు ఇతర భాషలోనూ ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ప్రస్తుత షెడ్యూల్ రాజమండ్రిలో జరుగుతుంది.

Ram Charan: RC15 నుంచి లీకైన ఫోటోలు.. అంచనాలను పెంచేస్తున్న రాంచరణ్, శంకర్ సినిమా!

RC15 Pics Leaked

Updated On : October 12, 2022 / 11:01 AM IST

Ram Charan: రాంచరణ్ హీరోగా, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కలయికలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా RC15. తెలుగులోనే కాదు, హిందీ, తమిళంతో పాటు ఇతర భాషలోనూ ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ప్రస్తుత షెడ్యూల్ రాజమండ్రిలో జరుగుతుంది.

Ram Charan: ఇందిరా దేవి గారి సంస్మరణ సభకు హాజరైన చరణ్ అండ్ ఉపాసన..

ఈ సినిమాలో చరణ్ తండ్రీకొడుకుల పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. పక్కా పల్లెటూరి తరహాలో సాగే ఫ్లాష్ బ్యాక్ లో రాంచరణ్ కు భార్యగా హీరోయిన్ అంజలి నటించబోతుంది. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ వీరిద్దరిపై ముఖ్య సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా, ఇందుకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ లీక్ అయ్యాయి.

నిర్మాత దిల్ రాజు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, సినిమాకు సంబంధించి ఏదొక విషయం బయటకు లీక్ అవుతూనే ఉంటుంది. కాగా ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో, చరణ్ లుక్స్ సినిమాపై మరింత హైప్ ని పెంచేలా ఉన్నాయి. ఈ సినిమాకు “సర్కారోడు” అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తుంది.

RC15 Pics Leaked

RC15 Pics Leaked