Gayatri Bhargavi : స్టార్ యాంకర్ గాయత్రీ భార్గవి ఇంట్లో విషాదం

ప్రముఖ యాంకర్ గాయత్రి భార్గవికి పితృ వియోగం కలిగింది. గాయత్రి తండ్రి సూర్య నారాయణ శర్మ అనారోగ్యంతో కన్నుమూశారు.

Gayatri Bhargavi

Gayatri Bhargavi : టాలీవుడ్‌ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. 2023 లో పలువురు సెలబ్రిటీలతో పాటు వారి కుటుంబ సభ్యులను కోల్పోయిన ఘటనలను చూసాం. తాజాగా ప్రముఖ యాంకర్ గాయత్రి భార్గవి తండ్రి అనారోగ్యంతో కన్నుమూసారు.

Devil : ‘డెవిల్’ డైరెక్టర్ ఇష్యూ.. సినిమా నుంచి పేరు తీసేసినా హిట్ అవ్వాలంటూ థ్యాంక్స్ చెప్తూ పోస్ట్..

ప్రముఖ నటి, యాంకర్ గాయత్రీ భార్గవి తండ్రి సూర్య నారాయణ శర్మ అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో గాయత్రీ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలిపారు. ప్రముఖ యాంకర్, నటి ఝాన్సీ ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Salaar Movie Fame Anchor Jhansi : నా జీవితంలో ఈ సంవత్సరం ముగ్గుర్ని కోల్పోయాను.. ఝాన్సీ ఎమోషనల్ పోస్ట్

గాయత్రీ భార్గవి ప్రముఖ దర్శకురాలు బాపు మనవరాలని చాలామందికి తెలుసు. కానీ ఎవరి ఇన్‌ఫ్లుయెన్స్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన గాయత్రి చాలా తక్కువ టైమ్‌లోనే యాంకర్‌గా, నటిగా నిలదొక్కుకున్నారు. చాలా యంగ్ ఏజ్‌లోనే పెళ్లి చేసుకుని తల్లైన గాయత్రి భర్త ప్రోత్సాహంతో తెరపై ఎంట్రీ ఇచ్చారు. అత్తారింటికి దారేది, జనతా గ్యారేజ్, నచ్చింది గాళ్ ఫ్రెండు, మర్డర్ వంటి సినిమాల్లో నటించి మెప్పించారు.

Jhansi Post