Sai Dharam Tej : కెరీర్ మొదటిలో నన్ను గైడ్ చేసింది ఎన్టీఆర్.. సాయి ధరమ్ తేజ్

కెరీర్ మొదటిలో తనని గైడ్ చేసింది ఎన్టీఆరే అంటూ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు. సరైన హిట్టులు లేని సమయంలో..

Sai Dharam Tej about ntr at Virupaksha promotions

Sai Dharam Tej : టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ మధ్య గట్టి పోటీ కనిపిస్తుంటుంది. అయితే అది కేవలం సినిమాలు వరుకే గాని వ్యక్తిగతంగా మెగా అండ్ నందమూరి హీరోలు మంచి మిత్రులని ఇప్పటికీ కొంతమంది గ్రహించలేని సత్యం. RRR సినిమా సమయంలో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ స్నేహం చూసి అందరు ఆశ్చర్యపోయారు. అయితే వారిద్దరి స్నేహం RRR తో ఏర్పడింది కాదు, ఎప్పటి నుంచో ఉన్నది అని ఇద్దరు హీరోలు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల అల్లు అర్జున్ బర్త్ డే కూడా ఎన్టీఆర్ చేసిన ట్వీట్ అందర్నీ ఆకట్టుకుంది.

NTR : వాళ్లందరికి స్పెషల్ పార్టీ ఇచ్చిన ఎన్టీఆర్.. తారక్ కోసం వచ్చిన అమెజాన్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్..

అలాగే మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో ఎన్టీఆర్ స్నేహం ఇటీవల బయటపడింది. విరూపాక్ష టైటిల్ గ్లింప్స్ కి ఎన్టీఆర్ తన వాయిస్ ఇచ్చి సాయి ధరమ్ తో తన స్నేహం రివీల్ చేశాడు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో సాయి ధరమ్ ఇంకో ఇంటరెస్టింగ్ విషయం షేర్ చేసుకున్నాడు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మా కుటుంబం (మెగా ఫ్యామిలీ) తరువాత నన్ను బాగా సపోర్ట్ చేసింది ఎన్టీఆర్. తను సినిమాలోకి రాకముందు నుంచే నాకు మిత్రుడు. ఇక నా కెరీర్ స్టార్టింగ్ సరైన హిట్టులు లేని సమయంలో.. ‘ఒరేయ్ తేజ మంచి సినిమాలు చేయాలిరా’ అంటూ నన్ను గైడ్ చేశాడు అంటూ చెప్పుకొచ్చాడు.

Mahesh Babu – Ram Charan : పెట్స్ ప్రేమలో పడిపోతున్న హీరో హీరోయిన్లు..

కాగా విరూపాక్ష చిత్రం మిస్టికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకి కథని అందిస్తుండగా కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 21న పాన్ ఇండియా వైడ్ ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.