పవర్ స్టార్ క్లాప్‌తో సుప్రీం హీరో సినిమా ప్రారంభం..

దేవ కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, నివేదా పేతురాజ్ జంటగా నటిస్తున్న చిత్రం ప్రారంభం..

  • Publish Date - March 12, 2020 / 07:20 AM IST

దేవ కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, నివేదా పేతురాజ్ జంటగా నటిస్తున్న చిత్రం ప్రారంభం..

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, దేవ కట్టా దర్శకత్వంలో నటిస్తున్న సినిమా గురువారం ఉదయం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘చిత్రలహరి’ తర్వాత నివేదా పేతురాజ్, తేజుతో నటిస్తోంది.(ప్రముఖ నటుడు కన్నుమూత)

దేవ కట్టా కొంత గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ చిత్రాన్ని జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సీనియర్ నిర్మాతలు భగవాన్, పుల్లారావు నిర్మిస్తున్నారు. హీరో హీరోయిన్లపై పవన్ క్లాప్ నిచ్చారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, వంశీ పైడిపల్లి, బీవీఎస్ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సినిమా దేవకట్టా స్టైల్ ఇంటెన్స్ పాలిటిక్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనుందని తెలుస్తుంది. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించనున్నారు. ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

See Also | హాలీవుడ్ దంపతులకు కరోనా : మేం బాగానే ఉన్నాం.. ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్నాం