Gaanja Shankar : శంకర్ దాదా, గుడుంబా శంకర్ హోగయా.. ఈసారి గంజా శంకర్.. సాయి ధరమ్ కొత్త సినిమా గ్లింప్స్..

ఈరోజు సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు కావడంతో.. తన న్యూ మూవీ టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేసి ఆడియన్స్ కి కిక్ ని ఇచ్చాడు.

Sai Dharam Tej Sampath Nandi new movie Gaanja Shankar title glimpse

Gaanja Shankar : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్.. ఈ ఏడాది ‘విరూపాక్ష’ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకున్నాడు. ఇక ఈ మూవీ తరువాత హెల్త్ రికవరీ కోసం కొంత గ్యాప్ తీసుకున్న సాయి ధరమ్.. నేడు తన కొత్త మూవీని అనౌన్స్ చేశాడు. ఈరోజు తేజ్ పుట్టినరోజు కావడంతో.. తన న్యూ మూవీ టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేసి ఆడియన్స్ కి కిక్ ని ఇచ్చాడు. ఈ సినిమాని టాలీవుడ్ మాస్ దర్శకుడు సంపత్ నంది డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాకి ‘గంజా శంకర్’ అనే మాస్ టైటిల్ ని పెట్టారు.

గతంలో మెగా హీరోలు.. చిరంజీవి ‘శంకర్ దాదా’, పవన్ కళ్యాణ్ ‘గుడుంబా శంకర్’గా ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ ‘గంజా శంకర్’గా ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్ పక్కా మాస్ కమర్షియల్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కనుంది. సాయి ధరమ్ తేజ్ లుక్ ని అయితే క్లియర్ గా రివీల్ చేయలేదు. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి.

Also read : Ram Charan : రామ్ చరణ్‌కి 50 శాతం వాటా ఉంది.. టైగర్ నాగేశ్వరరావు నిర్మాత..

సంపత్ నంది చివరిగా ‘సీటిమార్’ చిత్రంతో మాస్ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. విరూపాక్షతో తేజ్ కూడా బిగ్గెస్ట్ హిట్టుని అందుకున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరు చేతులు కలపడంతో మూవీ పై మంచి బజ్ క్రియేట్ అవుతుంది. గతంలో సంపత్ నంది మెగా హీరో రామ్ చరణ్ కి మంచి హిట్టుని అందించాడు. దీంతో మెగా అభిమానుల్లో మరిన్ని అసలు నెలకొన్నాయి. మరి ఈ కాంబినేషన్ ఎలాంటి హిట్టుని నమోదు చేస్తారో చూడాలి. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనేది ఇంకా తెలియజేయలేదు.