Telugu Actors: మొన్న తేజ్.. ఇప్పుడు రామ్.. ఎందుకిలా జరుగుతోంది?
బయట నుండి చూస్తే సినిమా ఓ రంగుల ప్రపంచంగా కనిపిస్తుంది కానీ.. అందులో ఉన్న వారికే తెలుసు దాని వెనుకనున్న కష్టమెంతో. ఒకప్పుడు సినిమా వేరు.. కథానాయకులు కాలు కదిపినా అది ప్రేక్షకులకు..
- Naresh Mannam
- Published On : October 5, 2021 / 03:45 PM IST
Telugu Actors
Telugu Actors: బయట నుండి చూస్తే సినిమా ఓ రంగుల ప్రపంచంగా కనిపిస్తుంది కానీ.. అందులో ఉన్న వారికే తెలుసు దాని వెనుకనున్న కష్టమెంతో. ఒకప్పుడు సినిమా వేరు.. కథానాయకులు కాలు కదిపినా అది ప్రేక్షకులకు పండగే. కానీ ఇప్పుడు హీరోలంటే చాలా చేయాలి. కేవలం నటన ఒక్కటే కాదు.. యాక్షన్ నుండి రియాక్షన్ వరకు చాలా కథలు ఉంటేనే ఇక్కడ పోటీ ప్రపంచంలో నిలిచేది. అందుకు ఇప్పుడు మన కుర్ర హీరోలు చెమటోడ్చి కష్టపడుతున్నారు.
Shruti Haasan: ఫోన్ నెంబర్ అడిగిన నెటిజన్.. శృతి షాకింగ్ రిప్లై!
అయితే.. షూటింగ్ లో ప్రమాదాలు కూడా పొంచిఉంటాయి. వాటి నుండి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కూడా సాహసంగానే ఉంటుంది. చిన్న పొరపాటు జరిగిన ఒళ్ళు గుల్లవుతుంది. తాజాగా యంగ్ హీరో రామ్ గాయపడ్డాడు. రామ్ రాబోయే కొత్త సినిమా కోసం సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలో రామ్ జిమ్ లో కసరత్తులు చేస్తుండగానే గాయపడ్డాడని తెలుస్తుంది. కొన్ని వారాల పాటు చికిత్స తీసుకున్న తర్వాత ఆయన మళ్లీ మన ముందుకు వస్తానని ట్వీట్ చేశాడు.
Naga Chaitanya-Samantha: అభిమానుల నుండి వెల్లువెత్తుతున్న విన్నపాలు!
ఇక వినాయక చవితి రోజున మెగా హీరో సాయి ధరమ్ తేజ్ దుర్గం చెరువు వద్ద కేబుల్ బ్రిడ్జ్ పై బైక్ నుండి కింద పడి గాయాల పాలైన సంగతి తెలిసిందే. అదృష్టవశాత్తు ఆయన ప్రాణాపాయం నుండి తప్పించుకున్నా తేజ్ త్వరలోనే నేను వస్తా అంటూ థమ్సప్ ఫోటోను షేర్ చేసి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. మరోవైపు మరో యువనటుడు అడవి శేష్ డెంగ్యూ ఫీవర్ తో ప్లేట్ లెట్స్ పడిపోయి హాస్పటిల్ పాలయ్యాడు. రెండు వారాల పాటు ట్రీట్మెంట్ అనంతరం కోలుకొని ఇంటికి వచ్చాడు. ఇక బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్ కూడా షూటింగ్‌లో గాయపడడంతో విదేశాలకు వెళ్లి సర్జరీ చేయించుకున్నాడు. మొత్తంగా తెలుగు యువ హీరోలు వరసగా ఇలా ఆస్పత్రి పాలవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది.
