హిట్టు కొట్టాలనే కసితో ఉన్న మెగా మేనల్లుడు

  • Published By: veegamteam ,Published On : April 3, 2019 / 05:53 AM IST
హిట్టు కొట్టాలనే కసితో ఉన్న మెగా మేనల్లుడు

Updated On : April 3, 2019 / 5:53 AM IST

ప్లాపుల మీద ప్లాపులు కొట్టి రేసులో వెనక్కి వెళ్లిపోయిన ఆ హీరో.. ఈసారి మాత్రం ఖచ్చితంగా సూపర్ హిట్టు కొడతానంటున్నాడు. గతం గతహ అంటూ కాన్ఫిడెంట్ గా ముందుకు సాగుతున్నాడు. ఈసారి ఖచ్చితంగా హిట్టు కొడతాడు అనుకున్న ప్రతిసారి ఓ ప్లాప్ ని ఖాతాలో వేసుకుంటూ..వరుసగా ఆరు ప్లాపులు కొట్టిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్..ఈసారి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హిట్టు పడుతుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి ఈసారైనా ప్లాపుల హీరోకి హిట్టు పడుతుందా..?

సాయి ధరమ్ తేజ్, కిశోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రలహరి సినిమా ఏప్రిల్ 12న ఆడియన్స్ ముందుకి రానుంది. లేటెస్ట్ గా చిత్రలహరి మూవీలోంచి మరో లవ్ సాంగ్ ని మూవీ టీం రిలీజ్ చేసింది. గతేడాది జూలైలో వచ్చిన ‘తేజ్ ఐ లవ్యూ’ తర్వాత సాయి ధరమ్ తేజ్ లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. వరుస ప్లాపులు పడటంతో.. కొద్దిరోజులు సినిమాలకి విరామం ఇచ్చి.. మళ్లీ ఎక్స్ ట్రా ఎనర్జీతో తిరిగొచ్చాడు. 2018 నవంబర్ లో చిత్రలహరి షూటింగ్ ప్రారంభమైంది.

ఇప్పటికే రిలీజైన చిత్రలహరి టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉన్నది ఒకటే జిందగీ, నేను శైలజ లాంటి..యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ ని తెరకెక్కించిన కిషోర్ తిరుమల డైరెక్టర్ కావడంతో..చిత్రలహరి పై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. చిత్రలహరిలో..సాయి ధరమ్ తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పెతురాజ్ నటిస్తున్నారు. ఇక 2016లో వచ్చిన సుప్రీమ్ సినిమా తర్వాత.. రెండేళ్లుగా సాయి ధరమ్ తేజ్ కి ఒక్క హిట్టు సినిమా కూడా లేదు. వరుసగా అన్ని సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. అందుకే..ఈసారి ఆరునూరైనా సరే హిట్టుకొట్టాలని కసితో ఉన్నాడు..సుప్రీమ్ హీరో.