SDT 19: ‘క’ మూవీ డైరెక్టర్స్ తో సాయి దుర్గ తేజ్ భారీ మూవీ.. ఆసక్తిరేపుతున్న కాన్సెప్ట్ పోస్టర్
విరూపాక్ష, సంబరాల యేటి గట్టు సినిమాల తరువాత మరో క్రేజీ ప్రాజెక్టుతో వస్తున్న సాయి దుర్గ తేజ్(SDT 19).
- V Santhosh Kumar
- Published On : April 3, 2026 / 12:58 PM IST
sai durgha tej next movie with ka movie makers sujith-sandeep
- సుజిత్-సందీప్ డైరెక్షన్‌లో తేజ్
- షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో క్రేజీ మూవీ
- విరూపాక్ష తరహాలోనే మరో ప్రయోగం
SDT 19: మెగా హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో తన కెరీర్‌లో అత్యంత కీలక దశలో ఉన్నారు. కొత్త దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా క్లైమాక్స్ కోసమే మేకర్స్ ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నారంటే దీని స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఈ పాన్-ఇండియా చిత్రం సెట్స్‌పై ఉండగానే, తేజ్ తన తదుపరి క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతేడాది ‘క’ సినిమాతో టెక్నికల్‌గా కొత్త ఒరవడిని సృష్టించి బ్లాక్‌బస్టర్ అందుకున్న దర్శకద్వయం సుజిత్ – సందీప్‌తో సాయి దుర్గ తేజ్(SDT 19) తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ నిర్మిస్తోంది. తాజాగా ఏప్రిల్ 3న ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తూ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు.
ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ‘విరూపాక్ష’ వంటి సస్పెన్స్ థ్రిల్లర్ తర్వాత తేజ్ మళ్లీ అటువంటి ప్రయోగాత్మక కథలనే ఎంచుకోవడం విశేషం. ‘క’ డైరెక్టర్ల విజన్, షైన్ స్క్రీన్స్ నిర్మాణ విలువలు తోడైతే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం సృష్టించడం ఖాయమని అటు మెగా ఫ్యాన్స్, ఇటు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఒక్క పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
