Tamanna Simhadri: పెళ్లి చేసుకున్న ట్రాన్స్‌జెండర్ ‘తమన్నా సింహాద్రి’.. భర్తను పరిచయం చేస్తూ ఆసక్తికర పోస్ట్
మొదటి పెళ్లిరోజు సందర్బంగా భర్తను పరిచయం చేసిన బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి(Tamanna Simhadri).
Transgender Tamanna Simhadri Gets Married
- ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్న తమన్నా సింహాద్రి
- మొదటి పెళ్లి రోజున సోషల్ మీడియాలో పోస్ట్
- భర్త వివరాలు వెల్లడించని తమన్నా సింహాద్రి
Tamanna Simhadri: తెలుగు బిగ్‌బాస్ సీజన్-3 కంటెస్టెంట్, ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి(Tamanna Simhadri) తన వైవాహిక జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఏడాది క్రితమే తనకు వివాహం జరిగిందని వెల్లడిస్తూ, మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా భర్తతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విజయవాడకు చెందిన తమన్నా, గతంలో అబ్బాయిగా పుట్టి ముంబైలో లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు.
Rashmika: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక.. ఇప్పుడు మేము ముగ్గురం అయ్యాం అంటూ పోస్ట్
తన అసలు పేరు మస్తాన్ కాగా, ఆపరేషన్ తర్వాత తమన్నా సింహాద్రిగా పేరు మార్చుకున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో యాంకర్ శ్రీముఖితో ఏర్పడిన స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. తన బంధువులు దూరం పెట్టినప్పుడు శ్రీముఖి తనను కుటుంబ సభ్యురాలిలా ఆదరించిందని తమన్నా ఎమోషనల్ అయ్యారు. రాజకీయాలపై మక్కువతో తమన్నా గతంలో లోకేశ్‌పై మంగళగిరిలో, పవన్ కల్యాణ్‌పై పిఠాపురంలో పోటీ చేసి వార్తల్లో నిలిచారు.
అయితే ఆమె భర్త పేరు, ఇతర వివరాలను మాత్రం ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు. సొంత ఊరిలో భర్తతో కలిసి వేడుకలు చేసుకున్న ఫోటోలు చూసిన అభిమానులు, తోటి బిగ్‌బాస్ కంటెస్టెంట్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన తల్లి కోరిక మేరకు అమ్మాయిగా మారి, ఇప్పుడు ఒక ఇంటిదైన తమన్నా జీవిత ప్రయాణం అందరినీ ఆకట్టుకుంటోంది.
View this post on Instagram
