Sai Durgha Tej : తిరుమలలో సాయి దుర్గా తేజ్.. స్వామీజీలా మారిపోయాడేంటి.. లుక్ వైరల్.. ఆ సినిమా కోసమేనా?

తాజాగా నేడు సాయి తేజ్ తిరుమలకు వెళ్లారు.

Sai Durgha Tej went to Tirumala Videos goes Viral

Sai Durgha Tej : మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ ప్రస్తుతం SDT18 సినిమా పనిలో బిజీగా ఉన్నాడు. తాజాగా నేడు సాయి తేజ్ తిరుమలకు వెళ్లారు. నేడు ఉదయం సాయి దుర్గా తేజ్ తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read : Prabhas : యువ రచయితలకు, డైరెక్టర్స్‌కు ప్రభాస్ ఆహ్వానం.. మీ దగ్గర మంచి కథ ఉందా.. అయితే..

సాయి దుర్గా తేజ్ లుక్ ప్రస్తుతం చర్చగా మరింది. ఫుల్ గడ్డంతో, ఫుల్ జుట్టుతో సాయి తేజ్ స్వామీజీలా ఉన్నాడు అని అంటున్నారు. ఇక పంచ కట్టడంతో అచ్చం స్వామీజీని అంటున్నారు. అయితే ఈ లుక్ SDT18 సినిమా కోసమని తెలుస్తుంది. ఇక ఈ లుక్ లో సినిమా అంటే ఏ రేంజ్ రస్టిక్ గా తీస్తున్నారో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

భారీ బడ్జెట్ తో పీరియాడిక్ యాక్షన్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రోహిత్ దర్శకత్వంలో సాయి దుర్గ తేజ్ హీరోగా, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా SDT 18 తెరకెక్కుతుంది. ఇటీవల ఈ సినిమా మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేసారు. ప్రస్తుతం సాయి తేజ్ ఇలా SDT18 లుక్ లో తిరుమలలో కనపడటంతో విజువల్స్ వైరల్ అవుతున్నాయి.