Prabhas : యువ రచయితలకు, డైరెక్టర్స్‌కు ప్రభాస్ ఆహ్వానం.. మీ దగ్గర మంచి కథ ఉందా.. అయితే..
తాజాగా ప్రభాస్ యువ రచయితలకు, డైరెక్టర్స్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు.

Prabhas Establish a Website for Supporting to Young Writers and New Talents
Prabhas : ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో భారీ లైనప్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సీనియర్స్ తో పాటు ఆల్మోస్ట్ కొత్త డైరెక్టర్స్ తో కూడా భారీ సినిమాలు చేస్తున్నాడు. అయితే తాజాగా ప్రభాస్ యువ రచయితలకు, డైరెక్టర్స్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ప్రభాస్ తన అన్న ప్రమోద్ తో కలిసి ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ అనే సంస్థని స్థాపించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి తాజాగా నేడు ఓ పోస్ట్ షేర్ చేసాడు ప్రభాస్.
Also Read : Pushpa 2 : అమెరికాలో సరికొత్త రికార్డ్ సెట్ చేసిన అల్లు అర్జున్.. పుష్ప రిలీజ్ కి ముందే..
ప్రభాస్ షేర్ చేసిన పోస్ట్ లో ఓ వీడియో ఉంది.. ఈ వీడియోలో మీ దగ్గర మంచి కథలు ఉన్నా అవకాశం రావట్లేదా. మీ లాంటి వాళ్ళ కోసమే ఒక వెబ్ సైట్ తీసుకొస్తున్నాము. ఆ వెబ్ సైట్ లో మీ కథను లేదా సినాప్సిస్ ని అప్లోడ్ చేస్తే ఆడియన్స్ వాటికి రియాక్ట్ అవుతారు అని తెలిపారు. అలా ఎక్కువ రియాక్షన్స్ వచ్చిన మంచి కథలను సినిమా రూపంలోకి తీసుకొస్తామని తన పోస్ట్ ద్వారా చెప్పాడు ప్రభాస్. ఈ వీడియోని పాన్ ఇండియా భాషల్లో అయిదు వీడియోలుగా పోస్టు చేయడం గమనార్హం. దీంతో దేశంలోని నలుమూలల నుంచి కొత్త ట్యాలెంట్ కు ఆహ్వానం పలుకుతున్నాడు ప్రభాస్.
ఇంకెందుకు ఆలస్యం మీలో రచయితలు ఉంటే, డైరెక్టర్ గా ట్రై చేస్తుంటే https://www.thescriptcraft.com/ అనే వెబ్ సైట్ లోకి వెళ్లి మీ కథను అప్లోడ్ చేయండి. నచ్చితే మీ కథ సినిమాగా మారొచ్చు. ప్రభాస్ ఇలా కొత్త రచయితలు, దర్శకుల కోసం సపోర్ట్ చేస్తుండటంతో ఫ్యాన్స్, నెటిజన్లు అభినందిస్తున్నారు.