Pushpa 2 : అమెరికాలో సరికొత్త రికార్డ్ సెట్ చేసిన అల్లు అర్జున్.. పుష్ప రిలీజ్ కి ముందే..

అమెరికాలో ఇప్పటికే పుష్ప 2 సినిమాకు టికెట్లు భారీగా అమ్ముడుపోతున్నాయి.

Pushpa 2 : అమెరికాలో సరికొత్త రికార్డ్ సెట్ చేసిన అల్లు అర్జున్.. పుష్ప రిలీజ్ కి ముందే..

Allu Arjun Pushpa 2 Movie Creates New Record in America

Updated On : November 6, 2024 / 11:48 AM IST

Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. పుష్ప సినిమాకు విదేశాల్లో కూడా మంచి హైప్ వచ్చింది. దీంతో పుష్ప 2 సినిమాని విదేశాల్లో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇక మన తెలుగు సినిమాలకు భారీ మార్కెట్ అయిన అమెరికాలో రిలీజ్ కు చాలా రోజుల ముందే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశారు.

Also Read : Ramayana : ర‌ణ్‌బీర్ సాయిప‌ల్ల‌వి రామాయ‌ణం.. రెండు పార్టులుగా.. రిలీజ్ ఎప్పుడంటే?

అమెరికాలో ఇప్పటికే పుష్ప 2 సినిమాకు టికెట్లు భారీగా అమ్ముడుపోతున్నాయి. తాజాగా పుష్ప 2 సినిమా అమెరికాలో రిలీజ్ కి చాలా రోజుల ముందే సరికొత్త రికార్డ్ సృష్టించింది. అమెరికాలో అత్యంత వేగంగా 15 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయిన మొదటి ఇండియన్ సినిమాగా పుష్ప 2 రికార్డ్ సెట్ చేసింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Image

అలాగే ఇప్పటికే అమెరికాలో ఆల్మోస్ట్ హాఫ్ మిలియన్ డాలర్స్ వసూళ్లు చేసేసింది పుష్ప 2. రిలీజ్ కు ముందే 1 మిలియన్ డాలర్స్ పైనే వసూలు చేసేలా ఉంది. రిలీజ్ కి ముందే అది కూడా అమెరికాలో అల్లు అర్జున్, పుష్ప 2 సినిమా సరికొత్త రికార్డులు సెట్ చేస్తన్నాయి. ఇక రిలీజ్ తర్వాత ఇంకెన్ని రికార్డులు బద్దలుకొడుతుందో పుష్ప 2 చూడాలి మరి.